బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. కత్రినా వెంకటేష్ తో జోడీగా తెరకెక్కిన మల్లీశ్వరి సినిమాతో పరిచయం అయిన కత్రినా తన అందమైన కళ్ళతో మన వాళ్ళని ఇట్టే ఆకట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ని సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఈమె తెలుగమ్మాయి కాదని ఎవరికీ అనిపించలేదు.