టాలీవుడ్ మన్మధుడు నాగార్జున వైల్డ్ డాగ్ అనే కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు రోజులు అయింది. ఈ జోనర్ కథ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు మొదటి రోజే ఫిలిం క్రిటిక్స్ మరియు నాగార్జున అభిమానులు ఇచ్చిన సమాచారం ద్వారా తెలిసింది. ఇది ఈ చిత్ర బృందానికి ఒక ఉత్సాహమనే చెప్పాలి. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మరియు టెక్నికల్ టీం హార్డ్ వర్క్ కి తెలుగు ఇండస్ట్రీ వర్గాల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి.