తమిళ నటి అయిన వరలక్ష్మి శరత్ కుమార్... కోలీవుడ్ లో తమిళ సినిమాల్లో అగ్ర కథానాయికగా చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన తెనాలి చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయింది ఈ తమిళ కుట్టి. ఈ సినిమాలో ఆమె విలన్ పాత్రను పోషించారు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఈమెకు పెద్దగా పేరు రాలేదు.