తెలుగు తమిళ సినీ పరిశ్రమలో అనుష్క గురించి తెలియని అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా అభిమానులను తన నటనతో మైమరపించింది. పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగిపోగల అతి కొద్ది మంది హీరోయిన్ లలో అనుష్క ప్రధమ స్థానంలో ఉంటారు. అనుష్క ముఖ్యంగా అరుంధతి సినిమాతో తన కెరీర్ ఓ లెవెల్ కి వచ్చింది అని చెప్పాలి.