తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో రాకెట్ లా దూసుకుపోతున్న వరలక్ష్మి శరత్ కుమార్ అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పేరు తెచ్చుకొని సత్తా చాటుతోంది. ఇటు తెలుగులోనూ తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇక తెలుగులో సందీప్ కిషన్ నటించిన తెనాలి రామకృష్ణ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్, ఆ తర్వాత అల్లరి నరేష్ నాంది చిత్రంలో లాయర్ పాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకుంది.