అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన "అలా వైకుంఠ పురములో" మూవీతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన హీరో సుశాంత్ కి ఈ సినిమా సక్సెస్ బాగా ప్లస్సయింది. రికార్డుల పరంగా బాహుబలి తర్వాత స్థానంలో నిలిచి అతిపెద్ద విజయవంతమైన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ సినిమా సుశాంత్ కి కూడా వరుస అవకాశాలు అందుకునేందుకు దోహదపడింది. ఇప్పుడు మళ్లీ బన్నీ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.