నందమూరి నట వారసుడు బాలకృష్ణ వరుస చిత్రాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద కుర్ర హీరోలకు పోటీగా నిలిచి తన పవర్ చూపిస్తున్నారు. ప్రస్తుతం సీనియర్ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో సింహ , లెజెండ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు రాగా ఇపుడు మళ్లీ మూడోసారి మనముందుకు రాబోతున్నారు.