డిస్ట్రిబ్యూటర్ గా వరస విజయాలు సాధిస్తూ మంచి జోష్ పై ఉన్న దిల్ రాజ్ ఒక టాప్ హీరోతో ఒక పెద్ద సినిమా తీయాలని గత కొంతకాలంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అతడి  ప్రయత్నాలు ఏమి సెట్ కావడం లేదు. దీనితో ఇతడి దృష్టి లేటెస్ట్ గా అల్లుఅర్జున్ పై పడింది అన్న వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం దిల్ రాజ్ తన ఆస్థాన దర్శకుడు హరీష్ శంకర్ ను వెంటేసుకుని బన్నీతో సినిమా చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

ఈమధ్యనే బన్నీ విదేశీయాత్ర ముగించుకు వచ్చిన నేపధ్యంలో అతడికి  హరీష్ శంకర్ చేత ఒక పవర్ ఫుల్ స్టొరీ చెప్పించడానికి దిల్ రాజ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. బన్నీ ఓకే చేసిన లింగు స్వామి సబ్జెక్ట్  ఫైనల్ స్టేజికి రావడాని మరికొన్ని నెలలు పడుతుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈగ్యాప్ మధ్య ఏదోవిధంగా బన్నీని ఒప్పించి హరీష్ శంకర్ తో ఈసినిమాను చేయడానికి దిల్ రాజ్ అల్లుఅర్జున్ కు అత్యంత భారీ పారితోషికం ఆఫర్ చేసి బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. 

అల్లు అర్జున్  ఈమధ్య విదేశాలకు వెళ్లేముందు ‘పవర్’ బాబీ సంపత్ నందిలతో సహా పలువురు డైరక్టర్లను బన్నీ కలిసి ఒక మంచి కథ గురించి ఆలోచనలు చేసిన నేపధ్యంలో  ప్రస్తుతానికి ఏ డైరక్టర్ దొరక్కపొతే దిల్ రాజు ఛాయిస్  బన్నీ ఫైనల్ ఛాయస్ గా మారినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఏ సినిమాపై ఎంత ఖర్చు పెట్టాలో ఎవరికి ఎంత ఇవ్వాలో దిల్‌ రాజుకి తెలిసినట్టుగా మరి ఎవ్వరికీ తెలియని నేపధ్యంలో ‘సరైనోడు’ సక్సస్స్ తో మంచి క్రేజ్ మీద ఉన్న బన్నీని బుట్టలో పెట్టి లాభాలు పొందడానికి దిల్ రాజ్ మాస్టర్ స్కెచ్ వేసాడు అంటూ ప్రచారం సాగుతోంది. 

త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కార్నెర్ చేసి ఒక టాప్ హీరోతో భారీసినిమాను చేద్ధామని ప్రయత్నించిన దిల్ రాజ్ కలలు సాకారం కాని నేపధ్యంలో బన్నీ ఎంతవరకు దిల్ రాజ్ మాయలో పడతాడో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: