మరో మూడు రోజులలో విడుదల కాబోతున్న ‘కబాలి' సినిమాను ప్రమోట్ చేస్తూ ఈసినిమా నిర్మాత కలైపులి ఎస్.థాను ‘బాహుబలి’ ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యాలు చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. రజినీకాంత్ ‘కబాలి’ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేస్తుందని దీనికి కారణం రజినీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా అన్ని వయస్సుల వాళ్ళు అభిమానులుగా ఉన్నారని దీనివల్ల ‘బాహుబలి’ రికార్డులను ఈజీగా బ్రేక్ చేయగల సత్తా ‘కబాలి’ కి ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు ఎస్. థాను.
ఈనెల 22న రిలీజ్ అవుతున్న ‘కబాలి’ క్రేజ్ ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది విపరీతంగా పెరిగి పోతోంది. దీనికితోడు ఈసినిమా ప్రమోషన్ ను కనీవినీ ఎరుగని రీతిలో చేస్తున్నారు. ఇపుడు ఎక్కడ చూసినా ‘కబాలి’ గురించే హాట్ టాపిక్. అయితే ఇంత సంచలనం సృష్టిస్తున్న ఈసినిమా ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అన్న విషయం పై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే ఈసినిమా రెండు వందల కోట్ల బిజినెస్ చేయడం దక్షిణ భారత సినిమా రంగ హాట్ న్యూస్ గ మారింది. అయితే ఈ మధ్యకాలంలో రజనీకాంత్ నుంచి వచ్చిన భారీ ఫ్లాప్స్ 'కొచాడియాన్', 'లింగా' సినిమాలు. ఘోరమైన ఫ్లాప్ లుగా మారినా ఆ విషయాలు పట్టించుకోకుండా ‘కబాలి’ సినిబాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. టాలీవుడ్ లో కూడ ‘కబాలి’ కి రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది.
అయితే ఈసినిమా ప్రోమో వీడియోస్‌లో పెద్దగా కమర్షియల్ కోణం కన్పించక పోవడంతో పాటు కేవలం ‘కబాలి’ స్టైలిష్ సినిమా మాత్రమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. మాస్ కు నచ్చే అంశాలు ఈ సినిమాలో చాల ఉన్నాయి అని ప్రచారం జరుగుతూ ఉన్నా వాస్తవానికి ఇది క్లాస్ సినిమా అన్న గాసిప్పులు కోలీవుడ్ లో హడావిడి చేస్తున్నాయి. రజినీ అభిమానులు కేవలం ఒక్క చెన్నై నగరం లోనే ‘కబాలి’ కటౌట్ల పై పాలాభి షేకం చేయడానికి 55 వేల లీటర్ల పాలు సిద్దం చేస్తున్నారు అనే వార్తలు రావడం బట్టి ‘కబాలి’ మ్యానియా ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది..