హీరో గోపిచంద్ త్వరలోనే ఇంటివాడు కానున్నాడు. మే 12న గోపించద్ వివాహం జరుగనుంది. హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మతో హైదరాబాద్ లో గోపిచంద్ వివాహం జరుగనుంది. ఇందుకు కోసం కుటుంబ సభ్యలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ కుమారుడు అయిన గోపిచంద్ ‘తొలివలుపు’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో విలన్ గాను మెప్పించాడు. హీరోగా ‘రణం’, ‘యజ్జం’, ‘ఆంధ్రుడు’, ‘శౌర్యం’ వంటి వరుస హిట్లు సాధించాడు. యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలోనే ‘సాహసం’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
వివాహం గోపిచంద్ జీవితంలో మరిన్ని శుభాలు కలుగచేయాలని APHERALD.COM ఆకాంక్షిస్తుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: