మేమిద్దరం ప్రెండ్స్ మాత్రమే అంటూ మీడియా ముందు ఎంత బుకాయించినా ఆ ఇద్దరూ అడ్డంగా బుక్కయ్యారు. రాంజ్నా మూవీ ప్రమోషన్లో భాగంగా సోనమ్‌కపూర్,ధనుష్ ఇద్దరూ తెగ టూర్లు వేస్తున్నారు. ఇందులో భాగంగా రాంజ్నా యూనిట్ అంతా హోటల్లో బోర్డింగ్ చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఇద్దరూ ఏకాంతంగా ఒకే రూంలో ఎక్కువ సేపు ఉంటున్నారంట.
అంతేకాకుండా ప్రమోషన్ టైం అంతా సాయంత్రానికే త్వరగా ఫినిష్ చేసుకుంటున్నారు. ఎక్కువ సమాయాన్ని హోటల్లోనే స్పెండ్ చేయటానికి ఇద్దరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
వీళ్ళి ఇద్దరిని కలవటానికి వచ్చిన అభిమానుల మధ్యలోనే ఈ ఇద్దరూ రోమాన్స్ చేసుకోవడంతో, ఆ సీన్స్ అన్నీ ఇద్దరి మధ్య ఎఫైర్‌ను గుర్తుకుచేస్తుందంట. బాలీవుడ్ మాత్రం వీళ్లిద్దరి మధ్య ఉన్నది ప్రెండ్షిప్ కాదు, ఖచ్చితంగా ఎఫైర్ అనే డిసైడ్ అయ్యారు. దీనికి ఏ విధంగా సమాధానం చెప్పుకుంటారో అని ధనుష్,సోనమ్‌కపూర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.