సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో టెన్షన్ పడిన ‘భరత్ అనే నేను’ రిజల్ట్ పాజిటివ్ గా రావడంతో మహేష్ మంచి జోష్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీకి సంబంధించిన అర్ధరాత్రి షోల టాక్ బయటకు రాగానే అప్పటి వరకు టెన్షన్ లో ఉన్న మహేష్ ఆనందంతో తన భార్య నమ్రతకు ముద్దు పెట్టుకున్న ఒక ప్రవేట్ ఫోటోను నమ్రత మహేష్ అభిమానుల కోసం లీక్ చేసింది.
MAHESH IN BHARATH ANE NENU LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ప్రస్తుతం ఈఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా మొన్న విడుదలైన ‘భరత్’ సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నా ‘రంగస్థలం’ రికార్డులను ఎంతవరకు బ్రేక్ చేయగలుగుతుంది అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘రంగస్థలం’ మూలంగా మహేష్ సినిమాకు నైజాంలో థియేటర్లు తక్కువ దొరికాయని స్వయంగా నిర్మాతలు ఒప్పుకుంటున్న నేపధ్యంలో ‘భరత్’ కు ఎంత సూపర్ పాజిటివ్ టాక్ వచ్చినా ‘రంగస్థలం’ రికార్డుల స్థాయిలో కలక్షన్స్ రావడం కష్టమైన పని అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
MAHESH IN BHARATH ANE NENU LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇది ఇలా ఉండగా మహేష్ తన సినిమాలలో ఇప్పటి వరకు ఎప్పుడు అనుకరించని పద్ధతిలో ‘భరత్ అనే నేను’ లో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణను అనుకరించడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ముఖ్యంగా సీఎంగా ‘భరత్’ ప్రమాణం చేసేటపుడు మహేష్ వాయిస్ పెంచగానే అందరికీ కృష్ణ వాయిస్ గుర్తుకు వస్తోంది. ఇది చాలదన్నట్లుగా సీఎం పాత్రలో హీరోయిన్ ను లవ్ చేసే సమయంలో మహేష్ ఆమెతో తిరిగేటపుడు జనాలు గుర్తు పట్టకుండా ఉండేందుకు మీసం పెట్టుకుంటాడు. 
సంబంధిత చిత్రం
ఆ లుక్ చూడగానే చాల మందికి కృష్ణ గుర్తుకు వస్తున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసినిమాలోని అనేక సీన్స్ లో మహేష్ కనపరిచిన బాడీ లాంగ్వేజ్ అచ్చం సూపర్ స్టార్ కృష్ణలా ఉండటంతో ఇన్నాళ్లూ తన సొంత ఐడెంటిటీతోనే సాగిన మహేష్ ఇప్పుడు ఇలా కృష్ణ బాడీ లాంగ్వేజ్ ని ఎందుకు అనుకరించాడు అంటూ మహేష్ అభిమానులు షాక్ అవుతున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: