తాప్సీ ఎప్పుడు ఎదో ఒక నెగటివ్ కామెంట్ చేస్తూ నిత్యం వార్తల్లో నలుగుతూ ఉంటుంది. సౌత్ సినిమాలతో పాపులారిటీ పెంచుకుని, బాలీవుడ్‌లోకి వెళ్ళాక.. సౌత్ సినిమాలపై.. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాపై విషం చిమ్మే ప్రయత్నం చేసిన తాప్సీ, మళ్ళీ తెలుగు సినిమాల్లో ఛాన్సుల కోసం 'క్షమాపణలు' చెప్పడానికీ వెనుకాడలేదు. ఇక, తన తాజా చిత్రం 'మన్మార్జియాన్' ప్రమోషన్ కోసం తాప్సీ, సోషల్ మీడియా వేదికగా చాలా రచ్చే చేస్తోంది.
సోషల్ మీడియాలో నెటిజన్లు తమకు తోచిన కామెంట్లు పెట్టడం మామూలే. ఆ కామెంట్స్‌ని పట్టుకుని, వాటికి రిప్లయ్స్ ఇస్తూ.. 'మన్మర్జియాన్' సినిమాని ప్రమోట్ చేస్తోంది. తాప్సీ స్పందిస్తోన్నది ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్‌కే కావడం గమనార్హం. అయితే, తాప్సీని ఉద్దేశించి కామెంట్ చేస్తోన్నవారు, పంజాబీ సంస్కృతిని కించపర్చేలా సినిమాలో సీన్స్ వున్నాయని ఆరోపిస్తున్నారు. అలా ఆరోపిస్తున్నవారిపై తాప్సీ సెటైర్లు దంచేస్తోంది.
నెటిజన్లు ఊరుకుంటారా.? తాప్సీని కడిగి పారేస్తున్నారు. తాప్సీ శరీరాకృతిపైనా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. వాటన్నిటికీ సమాధానాలు ఇస్తూ టైమ్ పాస్ చేస్తోందీ బబ్లీ బ్యూటీ. ఏం చేసినా సరే, సినిమాకి పబ్లిసిటీ రావాలంతే.! వార్తల్లో వుండడమెలాగో తాప్సీకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో. 'పింక్' తదితర సినిమాలతో జాతీయ స్థాయిలో తాప్సీకి గుర్తింపు లభించింది. సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్‌పై స్పందించడం 'నాన్సెన్స్' అని తెలిసీ, ఈ పబ్లిసిటీ స్టంట్స్ తాప్సీకి అవసరమా.?