ఈ మద్య కమెడియన్లు చాలా మంది ఊహించని విధంగా హీరోలుగా మారుతున్నారు.  గతంలో పలువురు కమెడియన్లు హీరోలుగా నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ సాధించలేక పోయారు.  బ్రహ్మానందం,అలీ లాంటి వారు హీరోలుగా నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు..దాంతో కమెడియన్లుగానే సెటిల్ అయ్యారు.  వీరిద్దరూ ఇప్పుడు టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక కమెడియన్ గా వచ్చిన సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్ లు హీరోగా పలు సినిమాల్లో నటిస్తున్నారు. 
Image result for saptagiri comedian
అయితే శ్రీనివాస్ రెడ్డి నటించిన సినిమాలు మంచి సక్సెస్ అందుకుంటున్నాయి.  ‘ప్రేమకథా చిత్రమ్ ’తో కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకున్న కమెడియన్ సప్తగిరి తర్వాత  హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో  వున్నాడు. గతంలో హీరోగా సప్తగిరి చేసిన 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' ఆయనకి మంచి మార్కులు తెచ్చిపెట్టింది. డైలాగ్ డెలివరీలోను..బాడీ లాంగ్వేజ్ లోను సప్తగిరి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 
Image result for saptagiri comedian
ప్రస్తుతం అరుణ్ పవార్ దర్శకత్వంలో సప్తగిరి మళ్లీ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు. నరేంద్ర,  జీవీఎన్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి, 'వజ్రకవచధర గోవిందా' అనే టైటిల్ ను ఖరారు చేశారు.  ఈ సినిమా పూర్తి యాక్షన్, ఎంట్రటైన్ మెంట్ తో ఉండబోతుందట. హీరోగా నిలదొక్కుకోవడానికి సప్తగిరి చేస్తున్న ప్రయత్నాలు ఈ సినిమాతోనైనా ఫలిస్తాయేమో చూడాలి. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: