తెలుగు సినిమా తెరపై సంక్రాంతి సందడి మొదలైంది. ఎన్టీఆర్ బయోపిక్‌లో భాగంగా మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పలువురు ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా విజయవంతం కావాలని పలువురు సినీప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

Related image


ఎన్టీఆర్‌ను అన్నయ్యా అని పిలుచుకునే నటుడు, నిర్మాత మోహన్‌ బాబు ఈ సినిమాలో బాలయ్యను చూసి షాక్ అయ్యారట. అన్నయ్యే మళ్లీ పుట్టారా అన్నంత అద్భుతంగా బాలకృష్ణ తండ్రి పాత్రకు నప్పారని ఆయన మెచ్చుకుంటున్నారు. తన మనసులోని భావాలని ఆయన ట్వీట్ ద్వారా తెలియజేశారు.

Image result for NTR BIOPIC POSTERS


యన్.టీ.రామారావు గారు.. తనకు అన్నయ్య అనీ.. ఒకే గర్భమునందు జన్మించకపోయినా మేమిద్దరం అన్నదమ్ములు అని చెప్పిన మహానుభావుడని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. ఆయన బయోపిక్ ని తెలుగులో తీయడమనేది మామూలు విషయం కాదన్న మోహన్‌ బాబు అందులోనూ మహానటుడు కుమారుడు బాలయ్య అంటే తండ్రి చేసినటువంటి పాత్రలను తను పోషించడం అనేది కూడా మామూలు విషయం కాదన్నారు.

Image result for NTR with mohanbabu


బాలయ్య ఎన్టీఆర్‌గా మెప్పించడం కొంచెం కష్టతరమైన పనే... అయినా ఒక మంచి దర్శకుడి చేతిలో పడి, ఆ సినిమా నిర్మించబడి, తను యాక్ట్ చేశాడంటే.. ఇదొక అద్భుతం, అమోఘం అంటూ మోహన్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు తనను కూడా పిలిచారని.. కొన్ని క్లిప్పింగ్స్ చూస్తే మళ్ళీ అన్నయ్య పుట్టాడా అని అనిపించిందని మెచ్చుకున్నారు. సినిమా అత్యద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని నమ్ముతూ ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని మోహన్‌ బాబు ట్వీట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: