మెగా డాటర్ నిహారిక మీద చాలా రూమర్స్ వచ్చాయి. విజయదేవరకొండ మరియు తన మీద వచ్చిన రూమర్స్ మీద స్పందించింది. రీసెంట్ గా జరిగిన సూర్యకాంతం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో నిహారికకు బిగ్ బ్రదర్ గా తనకుతాను ప్రకటించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ ఎపిసోడ్ పై ఇప్పుడు నిహారిక కూడా రియాక్ట్ అయింది. విజయ్ దేవరకొండకు, తనకు మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని మరోసారి స్పష్టంచేసింది.

తనకు, విజయ్ దేవరకొండకు పెళ్లంటూ యూట్యూబ్ ఛానెళ్లలో వస్తున్న వార్తల్ని నిహారిక కూడా ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ వస్తోందట. సూర్యకాంతం ప్రీరిలీజ్ ఫంక్షన్ లో ఆ పుకార్లపై ఓ క్లారిటీ ఇవ్వాలని కూడా అనుకుందట. కానీ ఆ వేదికపై పుకార్లపై మాట్లాడ్డం సరికాదంటూ ఊరుకుందట. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ధైర్యంగా మాట్లాడేశాడని, తమ మధ్య ఏమీలేదని ఓపెన్ గా చెప్పేశాడని అంటోంది నిహారిక.


నిజానికి సూర్యకాంతం ప్రీరిలీజ్ ఫంక్షన్ కు ముందు విజయ్ దేవరకొండను ఒక్కసారి కూడా కలవలేదంట నిహారిక. అలాంటప్పుడు తనతో పెళ్లంటూ ఎలా పుకార్లు సృష్టిస్తారని ప్రశ్నిస్తోంది. తనను విజయ్ చెల్లెలిగా ట్రీట్ చేయడం తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదంటోంది. పైగా అతడిపై ఇంకాస్త ఎక్కువ గౌరవం కలిగిందని చెబుతోంది ఈ మెగా డాటర్. మరోవైపు పెళ్లి తర్వాత సినిమాలు ఆపేస్తాననే ప్రకటనపై కూడా స్పందించింది నిహారిక. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలు ఆపేయనని, ఫ్యామిలీకి కొంత టైమ్ ఇచ్చి, భర్త అనుమతితో మళ్లీ సినిమాల్లో నటిస్తానని అంటోంది. మొత్తానికి నిహారిక ప్రకటనతో.. వీళ్లిద్దరి పెళ్లి రూమర్లపై పూర్తిగా ఓ స్పష్టత వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: