‘మహర్షి’ నిన్న మొదటి సోమవారం కలక్షన్స్ పరీక్షలో మంచి మార్కులు వేయించుకున్న నేపధ్యంలో ఈమూవీని మరింత ప్రమోట్ చేసి కలక్షన్స్ విషయంలో ఏమాత్రం డ్రాప్ లేకుండా వ్యవహరించదానికి మహేష్ ఈమూవీకి సంబంధించి సరికొత్త ప్రమోషన్ వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు త్వరలో మహేష్ ఈసినిమా యూనిట్ తో కలిసి మన తెలుగు రాష్ట్రాలలోని ముఖ్య కేంద్రాలకు సంబంధించిన ధియేటర్ల వద్దకు వెళ్ళి మహేష్ తన అభిమానులను అదేవిధంగా సాధారణ ప్రేక్షకులను కలవబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అదేవిధంగా ఈ పర్యటనలో మహేష్ కొన్ని గ్రామాలలోకి వెళ్ళి రైతుల వద్దకు వెళ్ళడమే కాకుండా ఈమూవీ మ్యానియాను గ్రామ స్థాయిలోకి తీసుకు వెళ్ళడానికి మహేష్ పదకాలు రచిస్తూ తన ఫారెన్ ట్రిప్ ను కూడ వాయిదా వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ప్రమోట్ చేయడం ద్వారా మహేష్ ‘మహర్షి’ ని 200 కోట్ల నెట్ కలక్షన్స్ తెచ్చుకునే మూవీగా మార్చి నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేయడానికి పక్కా వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్. 

ఈ వ్యూహాలలో భాగంగా ఈమూవీ నిడివిని ఈ వారాంతం నుండి మరో 10 నిముషాలు పెమ్చాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ వీకెండ్ లో జత చేసే సన్నివేశాలలో ఒక సీన్ తొలి అర్ధ భాగంలో ఉంటే మరో రెండు సీన్స్ ఇంటర్వెల్ తరువాత ఉంటాయని తెలుస్తోంది. 

దీనితో ఈసినిమా రన్ టైమ్ 188 నిముషాలు అవుతుందనీ అంటున్నారు.ఈసినిమా ఫస్ట్ ఆఫ్ లో వచ్చే మహేష్ పెళ్ళి చూపుల సీన్ 3 నిముషాల వరకు ఉంటే ఈ సినిమా నిడివి ఎక్కువై పోయిందని వంశీ పైడిపల్లి కట్ చేసినట్లు సమాచారం. అయితే ఆ పెళ్ళి చూపుల సీన్ లో ఇంకా చాల హాస్యం ఉన్న నేపధ్యంలో మహేష్ కోరికమేరకు ఆ పెళ్లి చూపుల సీన్ పూర్తిగా కలపబోతున్నట్లు టాక్. అదేవిధంగా ఈమూవీ ఇంటర్వెల్ తరువాత  అల్లరి నరేశ్ మహేష్ ల మధ్య వచ్చే ఒక సన్నివేసంతో పాటు రైతులతో మహేష్ మాట్లాడే సీన్ కూడ ఉంటుంది అని అంటున్నారు. ఈ సీన్స్ కలయిక వల్ల మళ్ళీ మహేష్ అభిమానులు అంతా మరొకసారి ‘మహర్షి’ ని చూస్తారు అన్న వ్యూహం ‘మహర్షి’ కలక్షన్స్ సునామీకి ఎలా సహకరిస్తుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: