మరి కొన్ని నెలలో విడుదకాబోతున్న ‘సాహో’ ‘సైరా’ మూవీల ఫలితం కోసం ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ రెండు సినిమాలు కలక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తాని ఇండస్ట్రీ విశ్లేషకుల అభిప్రాయం. అయితే అనూహ్యంగా ఈ రెండు సినిమాలకు ఒకే రకం సమస్యలు వెంటాడుతూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన సుజిత్ సురేంద్ర రెడ్డిలకు భారీ సినిమాలు తీసిన అనుభవం లేదు. దీనికి తోడు ఈ రెండు సినిమాల బడ్జెట్ కూడ విపరీతంగా పెరిగి పోవడంతో ఇంత భారీ బడ్జెట్ సినిమాలను డీల్ చేయగల శక్తి ఈ దర్శకులు ఇద్దరికీ ఉందా అన్న విషయమై అనేక సందేహాలు ఇప్పటికే చాలామందిలో ఉన్నాయి. 

వాస్తానికి షూటింగ్ ముగింపు దశకు చేరుకుని ఈ రెండు సినిమాల విడుదల తేదీలు ఖరారు అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల ఫైనల్ మూవీ అవుట్ పుట్ పూర్తిగా అనుకున్న స్థాయిలో రాలేదు అన్న గాసిప్పుల హడావిడి జరుగుతోంది. ఇప్పటికే ప్రభాస్ ‘సాహో’ అవుట్ పుట్ పై పూర్తి సంతృప్తిగా లేకపోవడంతో ఇంత భారీ సినిమాను అనవసరంగా సుజిత్ కు ఇచ్చి తప్పు చేసానా అన్న ఫీలింగ్ లో ఉన్నట్లు టాక్. 

ఇక ‘సైరా’ విషయంలో చిరంజీవి పరిస్థితి కూడ అదే అంటున్నారు. ఈమూవీని సురేంద్ర రెడ్డి చిరంజీవి కోరుకున్న స్థాయిలో తీయలేకపోయాడనీ దీనికితోడు చారిత్రాత్మక సినిమాలు తీయడంలో సురేంద్ర రెడ్డికి అనుభవం లేకపోవడం కూడ ‘సైరా’ ఫైనల్ అవుట్ పుట్ పై ప్రభావాన్ని చూపెట్టింది అని అంటున్నారు. దీనితో ఈ రెండు సినిమాలకు ఏర్పడ్డ భారీ క్రేజ్ ను చూసి ఆనందిస్తూనే లోలోపల ఈ రెండు సినిమాల పట్ల ఉన్న తమ అసంతృప్తిని బయటకు చెప్పుకోలేక ఒకే రకం సమస్యల మధ్య చిరంజీవి ప్రభాస్ లు కలవర పడటం యాధృశ్చికంగా మారింది అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: