'దంగల్' లాంటి క్రీడా స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని తీసిన దర్శకుడు ఓ తెలుగు సినిమా పై ప్రశంసలు కురిపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్
నితేష్ తివారీ చేతుల మీదగా "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ వచ్చిన
నితేష్ తివారీ
ఈ సినిమాను ప్రోమోట్ చేస్తూ ఓ వీడియో బైట్ చేశారు. ప్రధానంగా ఈ సినిమా హీరో నవీన్ పోలిశెట్టి పై ప్రశంసల వర్షం కురిపించారు. తనకు నవీన్ కు ఓ కామన్ పాయింట్ ఉందని చెప్తూ.. 'నవీన్ పోలిశెట్టి, నేను ఇద్దరం ఇంజనీరింగ్ చేశాం. ఇక సినిమాల పై ఆసక్తితో నవీన్ హీరో కావాలనుకొని వాళ్ళ నాన్నగారి చేత తిట్లు తింటే.. నేను డైరెక్టర్ కావాలనుకొని మా నాన్నగారి చేత తిట్లు తిన్నాను. అయితే మేం కన్న కలలు.. నిజం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నవీన్ పై ప్రేమతో కాకుండా ఈ సినిమా పై నమ్మకంతో చెప్తున్నాను. "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" ట్రైలర్ బాగుంది. సీరియస్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు డీసెంట్ కామెడీ కూడా మూవీలో ఉండబోతుందనే ఫీలింగ్ కలిగించింది. అలాగే విజువల్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా చ్చితంగా విజయం సాదిస్తుందని'
నితేష్ తివారీ చెప్పుకొచ్చాడు.
ఇక నవీన్ ఓ మంచి నటుడు అని, అందుకే తన నెక్స్ట్ మూవీలో నవీన్ కి కీలమైన్ పాత్రను ఇస్తున్నట్లు ఈ బాలీవుడ్ డైరెక్టర్ స్పష్టం చేశారు. శృతి శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి స్వరూప్ దర్శకతం వహించగా, రాహుల్ నక్కా నిర్మించారు. ఇక ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేస్తున్నారు. నవీన్ ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రధారిగా నటించారు. సినిమా ఆసాంతం ఎంటర్ టైనింగ్‌గా ఉంటుందట. మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందించారు.