ఆర్ ఆర్ ఆర్.. జక్కన్న చెక్కుతున్న మల్టీ స్టారర్. జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ నటిస్తున్న మూవీ. బాహుబలి గ్రాండ్ విక్టరీ తరువాత రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న మరో గ్రేట్ మూవీ. దాదాపుగా మూడు వందల కోట్ల బడ్జెట్. దేశంలోని ప్రముఖ ఆర్టిస్టులులంతా ఉన్న చిత్రం ఆర్ ఆర్ ఆర్.


మరి ఈ చిత్రం ఎపుడు పూర్తి అవుతుంది. ఇదీ కొత్తగా అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. ఈ ఏడాది జనవరి 21న గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుతున్న ఈ మూవీ ఇప్పటికి ఎంత అయిందన్నది కూడా తెలియడంలేదు. ఈ మూవీలో జూనియర్ ఎన్టీయార్ పక్కన హీరోయిన్ ఇంకా తేలలేదు. రామ్ చరణ్ పక్కన అలియా భట్ ని ఎంపిక చేసినా ఇంకా ఆమెతో షూటింగ్ స్టార్ట్ చేయలేదు. 


అతి పెద్ద సినిమా, క్రేజీ మూవీ. బహు భాషా చిత్రం అలాంటిది ఆర్ ఆర్ ఆర్ ఇంకా ఏ దశలో షూటింగ్ ఉందో తెలియడం లేదు. వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అంటున్నా ఫ్యాన్స్ కి మాత్రం నమ్మబుద్ధి కావడం లేదుట. మరి ఎందుకు ఇంత లేట్  అవుతుందో అంతుపట్టడం లేదు. ఇద్దరు స్టార్ హీరోలూ డేట్స్ ఇచ్చేసి కూర్చున్నారు. మరో సినిమా వూసు కూడా లేదు. రిలీజ్ అయితే మాత్రం సూపర్ హిట్. మరి ఆ రిలీజ్ ఎపుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: