ఇక ఈ చిత్రం తాజాగా తెలుగు ఇండస్ట్రీ లో ఇప్పట్లో దాదాపు ఎవరికి సాధ్యం కాని రికార్డు ను సృష్టించింది. ఈసినిమా యొక్క హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ ను గోల్డ్ మైన్ టెలీఫిల్మ్స్ సొంతం చేసుకుంది. ఆ తరువాత హిందీ వెర్షన్ ను యూ ట్యూబ్ లో అప్లోడ్ చేయగా అతి తక్కువ సమయంలో 170 మిలియన్స్ వ్యూస్ ను రాబట్టి కొత్త రికార్డు సృష్టించింది. ఒక టాలీవుడ్ సినిమా కు ఈ రేంజ్ లో వ్యూస్ రావడం అదే తొలిసారి. ఆ తరువాత ఎందుకో తెలియదు కానీ సినిమా ను యూ ట్యూబ్ నుండి తొలగించారు.
అయితే కొద్దీ రోజుల క్రితం మళ్ళీ అప్ లోడ్ చేయగా ఈరోజుతో 200మిలియన్స్ వ్యూస్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇప్పటికి ఆ సినిమా కు అక్కడ క్రేజ్ తగ్గలేదు. నార్త్ లో ఈ రేంజ్ లో వ్యూస్ ను రాబట్టిన టాలీవుడ్ సినిమా కూడా ఇదే. ఇప్పట్లో ఈ రికార్డు ను బ్రేక్ చేయడం అసాధ్యం. కాగా తెలుగు తో పాటు మలయాళం లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న అల్లు అర్జున్ ఈ సరైనోడు తో ఫ్యాన్ ఇండియన్ యాక్టర్ గా మారారు.