స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్  చిత్రం ఓ బేబీ.  ఇటీవల విడుదలైన ఈ చిత్రం 38కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది.  కొరియన్ మూవీ మిస్ గ్రానీ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం  ఓవర్సీస్ లో  వన్ మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టి అక్కడ కూడా  బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. అలాగే  భాగమతి ,మహానటి  సినిమాల తరువాత  1 మిలియన్ డాలర్ వసూళ్లను రాబట్టిన మూడవ చిత్రం గా ఓ బేబీ  రికార్డు సృష్టించింది.  


ఇక ఈ చిత్రం తమిళ ప్రేక్షకులముందుకు కూడా రానుంది. ఆగస్టు 15 న ఈ చిత్రం యొక్క  తమిళ వెర్షన్ అక్కడ విడుదలకానుంది.  కాగా  తమిళ్ లో సమంత కు మంచి ఫాలోయింగ్ వుంది. ఇటీవల  ఆమె తమిళంలో నటించిన  దాదాపు అన్ని  సినిమాలు  విజయం సాధించాయి. దాంతో ఓ బేబీ ని తమిళ్ లోకి డబ్ చేసి అక్కడ విడుదలచేస్తున్నారు. 


'అలా మొదలైంది'  ఫేమ్ నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో  సీనియర్ నటి లక్ష్మి , రావు రమేష్ , రాజేంద్ర ప్రసాద్ ,నాగ శౌర్య , తేజ ముఖ్య పాత్రల్లో నటించగా  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇక సమంత ఇటీవల మజిలీ తో సూపర్ హిట్ కొట్టగా తాజాగా ఈచిత్రంతో  మరో హిట్ ను ఖాతాలో వేసుకుంది.  ప్రస్తుతం ఆమె శర్వానంద్ తో కలిసి 96 రీమేక్ లో నటిస్తుంది. అలాగే  నాగార్జున  నటించిన మన్మథుడు 2 లో కూడా అతిథి పాత్రలో కనిపించనుంది.  ఈ చిత్రం ఈనెల 9న విడుదలకానుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: