బిగ్ బాస్ సీజన్ 3లో స్ట్రాంగ్ కంటెస్టంట్స్ అయిన అలి రెజా, శ్రీముఖిలకు శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో ఇంటి నుండి వచ్చిన లెటర్స్ లో షాకింగ్ న్యూస్ బయటపడ్డది. దాదాపుగా 8 వారాలుగా హౌజ్ లో ఉంటున్న కంటెస్టంట్స్ కు ఇంట్లో వాళ్ల దగ్గర నుండి మెసేజ్బిగ్ బాస్ సీజన్ 3లో స్ట్రాంగ్ కంటెస్టంట్స్ అయిన అలి రెజా, శ్రీముఖిలకు శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో ఇంటి నుండి వచ్చిన లెటర్స్ లో షాకింగ్ న్యూస్ బయటపడ్డది. దాదాపుగా 8 వారాలుగా హౌజ్ లో ఉంటున్న కంటెస్టంట్స్ కు ఇంట్లో వాళ్ల దగ్గర నుండి మెసేజ్ రావడంతో కంటెస్టంట్స్ అంతా ఎక్సైట్ అయ్యారు.  


శ్రీముఖికి వాళ్ల ఇంటి నుండి నువ్వు బాగా ఆడుతున్నావ్ అలానే ఆట కొనసాగించమని మెసేజ్ రాగా.. అలి రెజాకు మాత్రం బాగా ఆడమని చెప్పడంతో పాటుగా ఇంట్లో ఎలా ఉన్నా సరే బయట నీకొక భార్య ఉంది.. ఆమెకు నీ మీద ఉన్న నమ్మకాన్ని కాపాడుకుంటావని ఆశిస్తున్నా అంటూ మెసేజ్ వచ్చింది. 


ఆ లెటర్ ఇండైరెక్ట్ గా అలి శ్రీముఖితో క్లోజ్ గా ఉన్న కారణంగానే అలా రాసి ఉండొచ్చని అనిపిస్తుంది. శ్రీముఖి ఆల్రెడీ ఈ విషయంపై సీరియస్ గా ఆలోచిస్తుంది. శివ జ్యోతి అది గుర్తించి శ్రీముఖితో మాట్లాడుదామని ట్రై చేసినా కొన్నాళ్లు అలితో దూరంగా ఉండటం బెటర్ అని తనకి సింగిల్ గా ఆడే దమ్ము ఉందని చెప్పింది శ్రీముఖి. మొత్తానికి హౌజ్ లో తామేం చేస్తున్నామన్నది ఇంట్లో వాళ్లు చూడట్లేదు అనుకుంటే పొరపాటే. అలి, శ్రీముఖిలు ఈమధ్య ఎక్కువ క్లోజ్ గా ఉండటం అలి వాళ్ల ఇంట్లో వాళ్లకు నచ్చలేదని లెటర్ ద్వారా తెలిసింది.     


వాళ్లు అన్నారని కాదు కాని ఈమధ్య అలితో శ్రీముఖి చాలా క్లోజ్ గా ఉంటుంది. అటు బాబా భాస్కర్ తో ఉంటున్నా అలితోనే ఎక్కువగా హగ్గులు గట్రా జరుగుతున్నాయి. కచ్చితంగా అది వేరే విధంగా అర్ధమయ్యి ఉండొచ్చు. లెటర్ లో క్లియర్ గా చెప్పారు కాబట్టి ఇక మీదట అలి, శ్రీముఖి వారి హద్దుల్లో వారు ఉండటం బెటర్ అని చెప్పొచ్చు.   
 


మరింత సమాచారం తెలుసుకోండి: