కమెడియన్ వేణుమాధవ్ సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  సినిమా రంగంలోకి రాకముందు వేణుమాధవ్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో రూ.600 రూపాయలకు ఉద్యోగానికి చేరాడు.  అక్కడ పనిచేస్తూ ఎన్టీఆర్ తో సఖ్యతను పెంచుకున్నాడు. ఎన్టీఆర్ సఖ్యత కారణంగా అనేక మంది నేతలతో పరిచయం ఏర్పడింది.  ఆ పరిచయమే వేణుమాధవ్ జీవితాన్ని చాలా వరకు మార్చేసింది.  


వేణుమాధవ్ సినిమాలోకి వచ్చే ముందే మిమిక్రి నేర్చుకున్నాడు.  ఈ మిమిక్రి అయన జీవితాన్ని చాలా వరకు మార్చేసింది. ఓరోజు రచయిత దివాకర్ బాబుకు రవీంద్ర భారతిలో సన్మానం చేస్తున్నారట.  ఆ సన్మానానికి వేణుమాధవ్ మిమిక్రి చేశారు.  అదే కార్యక్రమానికి ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలు కూడా హాజరయ్యారు.  ఇద్దరు హాజరు కావడం.. వేణుమాధవ్ మిమిక్రి నచ్చడంతో సంప్రదయం సినిమాలో అవకాశం ఇచ్చారు.  


ఆ సినిమాకు రూ. 70వేల రూపాయల రెమ్యునరేషన్ కూడా ఇచ్చారట.  అలా మొదటి సినిమాకు మంచి పారితోషికం అందుకున్నారు.  అనంతరం వేణుమాధవ్ సినిమల్లో బిజీ అయ్యారు. తల్లిదండ్రుల మాటకు కట్టుబడి వేణుమాధవ్ నగరంలో 10 ఇల్లు కొనుగోలు చేశారు.  అవి భార్య పిల్లలు తల్లి దండ్రి పేరుమీద ఉన్నాయి.  ఆ తరువాత కరీంనగర్ లో పదెకరాల పొలం కొన్నాడు.  ఆ పొలం విషయంలో వేణుమాధవ్ కు.. పవన్ కళ్యాణ్ కు మధ్య ఓ ఒప్పదం జరిగిందట.  


అదేమంటే.. తన పొలంలో పండే పంటలోని మొదటి బస్తాను పవన్ కళ్యాణ్ కు పంపుతాడు.  అలానే పవన్ తన తోటలో పండే మామిడి పండ్లను వేణు మాధవ్ కు పంపుతారట.  ప్రతి సంవత్సరం అలానే చేస్తారట.  ఇప్పటి వరకు ఆ ఆచారం కొనసాగుతూనే ఉన్నది.  ఇప్పుడు సడెన్ గా వేణు మాధవ్ మరణించాడు.  మరి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కు బియ్యం బస్తా పంపుతారా లేదా.  పవన్ మాత్రం తప్పకుండా మామిడి పండ్లు పంపిస్తారన్నది మాత్రం వాస్తవం.  


మరింత సమాచారం తెలుసుకోండి: