టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరూ.. ఈ సినిమా నుండి తాజాగా టీజర్ రిలీజ్ చేసినట్లు మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ సంక్రాంతికి ఈ సినిమా చరిత్రలో నిలుస్తుందని అన్నారు. కాగా, ఈ టీజర్ లో మహేష్ పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టాడు. గ్రేడ్ మార్కును తీయాసుకొచ్చారు. ముఖ్యంగా ఇందులో  సాగిన.. 

 

"భయపడేవాడే బేరానికి వస్తాడు... మనదగ్గర బేరాల్లేవమ్మా...." అంటూ తనదైన శైలిలో పలికిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. "గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు" అంటూ విజయశాంతి, "ప్రతి సంక్రాంతికి అల్లుళ్లొస్తారు, ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు" అంటూ ప్రకాశ్ రాజ్ పలికిన సంభాషణలు ఆడియన్స్ లో కనెక్ట్ అవుతాయనడంలో సందేహంలేదు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రష్మిక మందన్న కథానాయిక. 

 

ఇకపోతే మహేష్ కు యాక్షన్ కోణంలో తెరకేక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడు. మిలటరీ ఆఫీసర్ అజయ్ పాత్రలో, ఫ్రెండ్ కోసం దేనికైనా రెడీ అంటూ ఉన్న ప్రాత్రలో నటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా నిన్న రిలీజ్ అయినా ట్రైలర్ కు జనల నుండి మంచి స్పందన లభిస్తుంది. దానితో సినిమాపై టాలీవుడ్ లో మంచి డిమాండు ఏర్పడుతుంది.  

 


సంక్రాంతికి బరిలో దిగబోతున్న రెండు పెద్ద సినిమాలు  సినీ ఇండస్ట్రీలో పోటీ గా నిలవనున్నాయి అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో.. ఈ సినిమాలో కూడా మంచి సాంగ్స్ తో పాటు గా త్రివిక్రమ్ సినిమా కావడంతో చాలా మంది బన్నీ హిట్ కొడతాయాడు అని చాలా ఎక్కువ ఆలోచిస్తారు. మరి మహేష్ సినిమా బన్నీ దాటికి వస్తున్నాడా అని ఆలోచనలో పడ్డారు. ఇకపోతే బన్నీ ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నాడు. మహేష్ అంతక చేయలేదు మరి ఏ మాత్రం హిట్ అవుతుందో చూడాలి.. ఎంత అస్త్రాలను వదిలిన కూడా సంక్రాంతి విన్నర్ ఎవరో తెలియాల్సి ఉంది .. 

మరింత సమాచారం తెలుసుకోండి: