ఒకప్పుడు 50 కోట్లు మాత్రమే టార్గెట్ గా ఉండే తెలుగు సినిమా ఇప్పుడు కోట్ల బడ్జెట్ తో వందల కోట్లు వసూళ్లతో సత్తా చాటుతుంది. స్టార్ సినిమాలే కాదు కుర్ర హీరోల సినిమాలు కూడా సత్తా చాటుతున్నాయి. ఈ దశాబ్ధ కాలంలో తెలుగు ప్రేక్షకుల ధోరణి కూడా మారింది. కథలో పట్టు ఉంటే చాలు రికార్డులతో చెడుగుడు ఆడేస్తున్నారు తెలుగు స్టార్స్. ఒకప్పుడు కేవలం ప్రాంతీయ సినిమాగా ఉన్న టాలీవుడ్ ఇప్పుడు ఇండియన్ సినిమాను శాసించే స్థాయికి ఎదిగింది.

 

బాలీవుడ్ స్టార్స్ సైతం తెలుగులో సినిమా రిలీజ్ అవుతుంది అంటే భయపడే పరిస్థితి వచ్చింది. తెలుగు సినిమాకు ఈ క్రేజ్ తీసుకొచ్చింది రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కథ కథనాల్లో కొత్తదనం ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. స్టార్ సినిమా అయినా సరే కుర్ర హీరో సినిమా అయినా సరే ముందు సినిమాకు కావాల్సింది సరైన కంటెంట్.

 

ఈ విషయంలో ఈమధ్య తెలుగు దర్శక నిర్మాతల పంథా మారింది. సరైన కథతో వస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తున్నారు. ఇక స్టార్ సినిమాకు కథా బలంతో వస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. బాహుబలి లాంటి పిరియాడికల్ మూవీస్ మాత్రమే కాదు శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి లాంటి సామాజిక చైతన్యంతో వచ్చిన సినిమాలు వస్తున్నాయి.

 

ఇలాంటి సినిమాలు ఆదరించడం వల్ల మరికొంతమంది దర్శకులు ఆ ప్రయత్నాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కంటెంట్ ఫుల్ సినిమా ఎప్పుడైనా ఓడిపోదు. మంచి కథలతో వస్తున్నారు కాబట్టే ఇదివరకు కన్నా సినిమాల హిట్ రేషియో ఇప్పుడు మెరుగుపడ్డదని చెప్పొచ్చు. కథాబలం ఉన్న సినిమాలకు బడ్జెట్ కూడా తోడవడంతో ప్రేక్షకాదరణతో ఆ సినిమాలు రికార్డుల పని పడుతున్నాయి. హీరో ఎవరైనా సరే సినిమాలో కథ బాగుంటే ఓటేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: