పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు డిస్కోరాజా బాక్సాఫీస్ వద్ద రాజాగా నిలిచినట్టే. కాంపిటీషన్ లేకుండా సోలోగా దిగుతున్న రవితేజకు కలిసొచ్చేలా కనిపిస్తోంది. సెన్సార్ రిపోర్ట్ కూడా అనుకూలంగా ఉండటంతో మాస్ రాజా క్లీన్ హిట్ కొట్టబోతున్నాడనే టాక్స్ నడుస్తున్నాయి. 


డిస్కోరాజాతో మాస్ మహారాజా రవితేజ మొదటి సారి సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నాడు. విఐ ఆనంద్ దర్శకత్వంలో తాళ్లూరి రామ్ నిర్మిస్తున్న డిస్కోరాజా ఈ నెల 24న థియేటర్స్ లోకి రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోస్, టీజర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

 

సెన్సార్ బోర్డ్ సభ్యులు కట్స్ చెప్పకుండా, ఒకటి రెండు చోట్ల డైలాగ్స్ కు మ్యూట్ చెప్పి యుఎ సర్టిఫికెట్ జారీ చేశారట. రవితేజ ఈ సారి క్లీన్ సోషియో ఫాంటసీ మూవీతో హిట్ కొట్టబోతున్నాడనే టాక్ నడుస్తోంది. రెండు విభిన్నమైన పాత్రల్లో మాస్ రాజా చేసే ఎంటర్ టైన్ మెంట్ ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. 

 

జనవరి 24న రిలీజ్ కానున్న డిస్కోరాజా సినిమాకు రిపబ్లిక్ డే కలిసొస్తోంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు ఓపెనింగ్స్ అదిరిపోతాయని చెప్పాలి. దీనికి తోడు పోటీలో మరో సినిమా లేకపోవడం కూడా రవితేజ సినిమాకు హెల్ప్ కానుంది. సంక్రాంతి సినిమాల సందడి కూడా ముగిసింది. ఇలాంటి టైమ్ లో సింగిల్ గా వస్తున్న రవితేజ బాక్సాఫీస్ ను ఏమేరకు ఉపయోగించుకుంటాడో చూడాలి. సాధారణంగా రవితేజను మాస్ ప్యూపుల్స్ బాగా ఇష్టపడతారు. ఎందుకంటే రవితేజ డైలాగ్స్ డెలివరీ మాస్ మనుషులను బాగా అట్రాక్ట్ చేస్తుంది. అందుకే వాళ్ల నాడి పట్టుకునేందుకు మాస్ మహారాజా శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు. ఎలాగైనా ఈ మూవీతో హిట్ కొట్టాలనే కసితో రగిలిపోతున్నాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: