టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతవరకూ ఆ పేరు విలువ అమూల్యం. ఎన్టీఆర్ నట వైభవం ఎన్న తరమా? పౌరాణికాలు...జానపదాలు, చారిత్రాత్మక ఇతివృత్తాలతో పాటు సాంఘీక చిత్రాల్లో కూడా సత్తా చూపించిన ఈయ‌నకు.. తెలుగువారికి విడ‌తీయ‌లేని సంబంధం ఉంది. ఇక రూపంలో, నటనలో తాత నందమూరి తారక రామారావు వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.

 

 హరికృష్ణ తనయుడు, అన్నగారి మనవుడిగా 18 ఏళ్ల వయస్సులో జూనియర్ ఎన్టీఆర్ గా తెలుగుతెరకు పరిచయం అయ్యాడు. తాత అడుగుజాడల్లోనే నడుస్తూ తెలుగు తెర ని వెలిగిస్తున్నారు. అచ్చం తాతలానే పౌరాణికాల్లోనూ ప్రతిభ కనబరుస్తూ దూసుకుపోతున్నారు. ఈయ‌న సాంఘిక‌ సినిమాల గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బాక్సాఫీస్ దగ్గర కాసులు వర్షించే చిత్రాలకు కేరాఫ్ గా నిలిచారాయన. మాట్నీ ఐకాన్ గా ప్రేక్షకుల అభినందనలు అందుకుంటున్నారు. అయితే సాంఘిక‌ సినిమాల‌తో పాటు పౌరాణిక సినిమాలు కూడా చేయ‌గ‌ల‌ను అని సీనియ‌ర్ ఎన్టీఆర్‌, బాల‌కృష్ణ త‌ర్వాత ఈ త‌రం హీరోల్లో ఎన్టీఆర్ మాత్రమే నిరూపించుకున్నాడు.

 

అలాగే ఎన్టీఆర్  పౌరాణికా చిత్రం అంటే ముందుగా గుర్తుకు వ‌చ్చేది యమదొంగ.  2007లో విడుదలైన ఒక సోషియో ఫాంటసీ తెలుగు సినిమాకు  ఎస్.ఎస్. రాజమౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. యమగోలతో పెద్ద ఎన్టీఆర్‌ను మరిపించిన ఈ యమదొంగ. ఈ చిత్రం లో కాసేపు యముడి పాత్రలో కనిపించి పౌరాణిక పాత్రల లోనూ రాణించగలడని నిరూపించుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా సన్నబడి, లావవుతున్నాడన్న విమర్శలను తిప్పి కొట్టాడు. ఇక హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన తారక్.. నటన, డ్యాన్స్‌లు, డైలాగ్ డెలివరీ, ఎమోషన్, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మ‌రియు తక్కువ కాలంలోనే స్టార్ హోదా సంపాదించుకొని, తాతకు తగ్గ మనవుడు అనిపించుకున్నాడు. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: