మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఏదైనా సినిమా చూసి నచ్చాడు అంటే ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అన్నది గెస్ చేయగలరు కాబట్టే ఇన్నేళ్ళు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ఉండగలిగారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉంటాయి. ఇక అల్లు అరవింద్ ప్రత్యేకంగా ఒక సినిమా చూసి మెచ్చి ఆ డైరక్టర్ కు వెంటనే చెక్ ఇచ్చాడు అంటే అది మామూలు విషయం కాదు.

 

పలాస 1978 సినిమా టైటిల్ దగ్గర నుండి ప్రతిది ప్రత్యేకంగా అనిపించినా ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ ముందే ప్రీమియర్స్ చూసిన అల్లు అరవింద్సినిమా డైరక్టర్ కరుణ కుమార్ కు సినిమా ఆఫర్ ఇచ్చారు. అదేదో మాటివ్వడం కాదు అడ్వాన్స్ కూడా ఇచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అరవింద్ కరుణ కుమార్ తో దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలాస 1978 ఒ డిఫరెంట్ సినిమా అని ముందునుండి చెబుతున్నారు.

 

అల్లు అరవింద్ లాంటి నిర్మాతసినిమా సూపర్ అన్నాడంటే ఇక తిరుగు ఏముంటుంది చెప్పండి. అంతేకాదు అరవింద్ పిలిచి ఆఫర్ ఇచ్చాడు అంటేనే కచ్చితంగా పలాస మూవీలో విషయం ఉండే ఉంటుంది. రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. అల్లు అరవింద్ డెసిషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరో  24 గంటలు వెయిట్ చేస్తే సరిపోతుంది. అల్లు అరవిన్ నిర్మాతగా కరుణ కుమార్ సినిమాలో హీరోగా ఎవరు చేస్తారన్నది చూడాలి.  యువ హీరోలతో గీతా ఆర్ట్స్ సినిమాలు వరుసగా ప్లాన్ చేస్తున్నారు.  
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: