జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యాంకర్ రష్మి గౌతమ్ తన చుట్టూ జరుగుతున్న సంఘటనలపై ఎల్లప్పుడు స్పందిస్తూనే ఉంటారు. మూగజీవులకు కూడా తన వంతు సహాయం చేస్తూ వాటి జీవితాల్లో సంతోషం నింపుతున్న రష్మి గౌతమ్ పట్ల ఎంతో మందికి చాలా గౌరవం ఉంది. ఆమె మంచి వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఐతే ప్రజలకు మంచి చేయడానికి ఎప్పుడూ ముందుండే ఈ ముద్దుగుమ్మ రష్మి గౌతమ్ ఈసారి మొక్కలు నాటి, చెట్ల ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా అవగాహన కల్పించారు.




వివరాలు తెలుసుకుంటే వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ఎంతో ఇష్టంగా టేకప్ చేసిన రష్మి గౌతమ్ నానక్ రామ్ గూడా లోని తన నివాసంలో హైబిస్కస్ మొక్కని నాటారు. రష్మి మొక్కని నాటుతున్నప్పుడు... రోజా వీడియో రికార్డ్ చేసింది.

 

 

మొక్క ని నాటిన అనంతరం రష్మి గౌతమ్ మాట్లాడుతూ... 'మొక్కలు నాటాలని మనం తీసుకున్న ఈ ఇనిషియేటివ్ ని టెంపరరీగా భావించకుండా శాశ్వతంగా కొనసాగించాలి. మీ పరిసరాలలో కూరగాయ, మూలికల, పూల మొక్కలు నాటండి. ఎందుకంటే మొక్కలు, చెట్లు అనేవి మనం జీవించడానికి చాలా అవసరం. చెట్లు వాతావరణంలోని కార్బన్ డయాక్సయిడ్ ని పిలుచుకొని మనకి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ని అందిస్తున్నాయి. ప్రస్తుతం మన భూమి మీద మొక్కలు ఎక్కువ లేకపోవడం వలన గ్లోబల్ వార్మింగ్ సమస్య తలెత్తుతోంది. దీని కారణంగా ఉష్ణోగ్రతలు 45 నుంచి 50 వరకు పెరిగిపోతున్నాయి. అందుకే గ్లోబల్ వార్మింగ్ సమస్యని అరికట్టేందుకు మనం మొక్కలను వీలైనంత వరకు నాటాలి. మీరు కూడా ఈ ఇనిషియేటివ్ ని తీసుకోండి. నేను కూడా ఈ చాలెంజ్ ని ముగ్గురికి విసురుదామని అనుకుంటున్నాను. ఆ ముగ్గురు ఎవరంటే మై డియర్ ఫ్రెండ్ అనసూయ, శేఖర్ మాస్టర్, యాక్టర్ సత్య దేవ్', అని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: