భారతీయ చలన చిత్ర రంగంలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన విశ్వనటుడు కమల్ హాసన్ తాజాగా తనను పోలీసులు వేధిస్తున్నారంటూ  మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు 2’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్ సమయంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది.   భారీ క్రేన్​ కుప్పకూలి మీదపడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. డైరెక్టర్​ శంకర్​తో పాటు మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.  ఈ ప్రమాదంలో శంకర్ ఇద్దరు అసిస్టెంట్​ డైరెక్టర్లు, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. డైరెక్టర్​ శంకర్​తో పాటు మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

 

ఆ సమయంలో అక్కడే సెట్​లో హీరో కమల్​హాసన్​తో పాటు  హీరోయిన్​ కాజల్​ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో శంకర్, కమల్ హాసన్ కి  సీబీసీఐడీ పోలీసులు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీనిపై కమల్ పోలీసుల విచారణకు కూడా హాజరయ్యారు.  అయితే ఇప్పుడు తనను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని.. పోలీసుల వైఖరిని నిరసిస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమల్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. 

 

తాను  సీబీసీఐడీ పోలీసులు కూడా హాజరై వివరాలు తెలియజేశానని కానీ.. కొన్ని రోజుల నుంచి పోలీసుల వ్యవహర శైలి తనకు ఇబ్బందులకు గురి చేసిందిన కమల్ హాసన్ ఆరోపిస్తున్నారు.  ప్రస్తుతం కమల్ హాసన్ రాజకీయాల్లో కూడా ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆ మద్య  'మక్కల్ నీది మయ్యం'  పార్టీని కూడా ఆయన స్థాపించారు.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా పోటీశారు.. కానీ ఎక్కడ కూడా నెగ్గలేకపోయారు. ఓ వైపు ఇండస్ట్రీలో కొనసాగుతూనే.. తనదైన మార్క్ రాజకీయాల్లో చాటుకుంటున్నారు కమల్ హాసన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: