మిల్కీ బ్యూటీ తమన్నా తన అందం, అభినయం, నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంది. ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. అలాగే స్టార్ హీరోలతో కూడా నటించి స్టెప్పులేసింది. ఇటీవల ఈమె మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరులో మహేష్ సరసన స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ భామ టాలీవుడ్ లోనే కాదు. బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించింది.


 కానీ అక్కడ అనుకున్నంత సక్సెస్ కాలేదు మిల్కీ బ్యూటీ. అలానే అంత గుర్తింపు కూడా సాధించుకోలేక పోయింది. ఒక వైఫు గ్లామర్ రోల్స్ చేస్తూ అక్కడ అదరకొడుతూనే మరోవైపు వైవిధ్య పరమైన పాత్రలను ఎంచుకుంటూ నటిస్తోంది. టాలీవుడ్ అభిమానులు తమన్నాని మిల్కీ బ్యూటీ అని పిలుస్తారు. ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ తో, నటనతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ఔరా అనిపించింది. తన డాన్స్ లతో అభిమానుల మనసులను కట్టిపడేసింది. 


కానీ.. ఇప్పుడు తమన్నాకి అంత ఆఫర్లు రావటం లేదు. సినిమా ఆఫర్లు రాక కాబోలు ఐటమ్ సాంగ్స్ లో రెచ్చిపోయి తన అందాలను ఆరబోస్తుంది. ఈ బీయూటీకి అంత జోరు తగ్గిన అప్పుడప్పుడు మంచి మంచి సినిమాలలో నటించి అభిమానులకు దగ్గరవుతుంది. ఇటీవల తమన్నా సైరా చిత్రంలో నర్తకిగా నటించింది. తమన్నా ఆ పాత్రలో నటించి పలు ప్రశంసలను దక్కించుకుంది. సైరా చిత్రంలో తమన్నా పాత్ర చాలా అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు దక్కాయి. అలానే ఆమె చాలా అందంగా ఉందంటూ కూడా అభిమానులు తెగ మురిసిపోయారు.


 అయినా తమన్నా మిల్కీ అందాలకు ఫిదా కానీ యువత ఉండరు. ఈ అమ్మడు  ఎప్పుడు తన అభిమానులతో టచ్ లో ఉంటూ సోషల్ మీడియాలో తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. ఈమెను మిలియన్ల కొద్దీ అభిమానులు సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటారు. ఈమె సినిమాలతో పాటుగా ఫోటో షూట్ లతోను పిచ్చెక్కిస్తుంది.

 

   
     

మరింత సమాచారం తెలుసుకోండి: