తెలుగు చిత్ర పరిశ్రమలో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంటరైన విజయ్ దేవరకొండ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు. పెళ్లిచూపులు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన విజయ్ దేవరకొండ... ఇక ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించాడు  అని చెప్పాలి. ఇక ఈ సినిమా విజయ్ దేవరకొండ ను ఒక్కసారిగా స్టార్ హీరోని చేసింది. తన సినిమాలతో నే కాదు తన ఆటిట్యూడ్ తో  కూడా యూత్ లో బాగా క్రేజ్ సంపాదించాడు  విజయ్ దేవరకొండ. 

 

 ప్రస్తుతం యువ  హీరోలందరి లో విజయ్ దేవరకొండ కు మంచి సక్సెస్ రేటు ఉన్న విషయం తెలిసిందే. కేవలం తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా విజయ్ దేవరకొండ కు మంచి క్రేజ్ ఉంది. ఇక విజయ్ దేవరకొండ అంటే హీరోయిన్లు సైతం తెగ ఇష్టపడుతూ ఉంటారు. విజయ్ సినిమా వస్తుందంటే యూత్ మొత్తం సినిమా చూసేందుకు పోటీ పడుతూ ఉంటాయి. అయితే మొన్నటికి మొన్న వరల్డ్ ఫేమస్ లవర్  సినిమాతో నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేసిన విజయ్ దేవరకొండ... ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

 

 అయితే ఈ సినిమా ఒక క్రేజీ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్నట్లు  టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమా విజయ్ కెరీర్ తో పాటు పూరి జగన్నాథ్ కెరియర్ కూడా ఎంతో కీలకంగా మారనుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన విజయ్ దేవరకొండ పలు ఆసక్తికర ఈ వ్యాఖ్యలు చేశారు. తనతో నటించేందుకు ఎవరైనా కొత్త హీరోయిన్లను ఎంచుకోవాల్సి వస్తే... బాలీవుడ్ హీరోయిన్లు జాన్వి కపూర్,  కియారా అద్వానీ ఎంచుకుంటాను అంటూ విజయ్ దేవరకొండ సమాధానమిచ్చాడు. అయితే తను ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఫలానా హీరోయిన్ తోనే నటించాలి అని ఎప్పుడూ అనుకోలేదు అంటూ స్పష్టం చేశాడు. ఏ భాషకు చెందిన నటి అయిన తాను అంతగా పట్టించుకోను అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో విజయ్ దేవరకొండ రష్మిక మందన జోడికి మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: