పవన్ కళ్యాణ్ భాగ్యలక్ష్మికే ఓటేశాడు. భార్య పాత్రకు భాగీ తప్ప మరొకరు వద్దని తేల్చేశాడు. క్రేజ్, స్టార్డమ్ లెక్కలతో యంగ్ బ్యూటీస్ ని తీసుకుందామని చెప్పినా.. పవన్ మాత్రం పాత హీరోయిన్ కే ఓకే చేశాడు. ఇక పవన్ రికమండేషన్ తో వకీలమ్మగా మారిపోతోంది భాగ్యలక్ష్మి. 

 

పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ అంటే చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి. పవర్ స్టార్ ఇమేజ్ ను లెవల్ చేసే బ్యూటీనే తీసుకొస్తారు దర్శక నిర్మాతలు. పవన్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కు ఇలాంటి కాలిక్యులేషన్స్ తోనే పూజా హెగ్డే లాంటి క్రేజీ హీరోయిన్ ని పరిశీలించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం శ్రుతి హాసన్ ని ఓకే చేశాడు. గబ్బర్ సింగ్ బ్యూటీని రిపీట్ చేస్తున్నాడు.

 

బాలీవుడ్ సెన్సిటివ్ హిట్ కొట్టిన పింక్ రీమేక్ గా తెరకెక్కుతోంది వకీల్ సాబ్. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్లే చేస్తున్నాడు. అయితే ఒరిజినల్ స్టోరీలో అమితాబ్ చాలా ఓల్డ్ గా కనిపిస్తాడు. బిగ్ బి భార్యను పెరాలసిస్ పేషెంట్ గా చూపించారు. కానీ తమిళ రీమేక్ లో అజిత్ ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు చేశారు. అజిత్ భార్య పాత్రకు విద్యాబాలన్ ను తీసుకున్నారు. ఇక్కడ కూడా పవన్ ఇమేజ్ కు తగ్గట్టు హీరోయిజం, హీరోయిన్ ను యాడ్ చేశారు. 

 

కరోనా ఎఫెక్ట్ తో వకీల్ సాబ్ షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఈ వైరస్ ప్రభావం తగ్గగానే మళ్లీ షూటింగ్  స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్ లోనే శ్రుతి హాసన్ జాయిన్ అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాల్లో పవన్ తో జోడీ కట్టింది శ్రుతి. ఇప్పుడు ఈ వకీల్ సాబ్ తో పవన్ హ్యాట్రిక్ కంప్లీట్ చేయబోతోంది శ్రుతి. 

మరింత సమాచారం తెలుసుకోండి: