నితిన్ హీరోగా వెంకీ కుడుములు డైరక్షన్ లో వచ్చిన సినిమా భీష్మ. నితిన్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. సినిమా మొత్తం పూర్తయ్యాక రన్ టైం ఎక్కువ అవుతుందని కొన్ని మంచి సీన్స్ కూడా ట్రిమ్ చేయాల్సి వస్తుంది. అయితే చివరి నిమిషంలో కొన్ని సన్నివేశాలు డిలీట్ చేయాల్సి వస్తుంది.

 

హిట్టైన సినిమా డిలీటెడ్ సీన్స్ కు మంచి క్రేజ్ ఉంటుంది. నితిన్ భీష్మ నుండి కూడా రెండు వారాల క్రితం ఒక డిలీటెడ్ కామెడీ సీన్ రిలీజ్ చేశారు. ఇక ఈరోజు ఉగాది సందర్భంగా భీష్మ నుండి హీరోని ఇంప్రెస్ చేసే హీరోయిన్ సీన్ ఒకటి రిలీజ్ చేశారు. డిలీట్ సీన్ అయినా ఈ నిమిషన్నర సీన్ సినిమాలో ఉంటే బాగుండేది అనేలా ఉంది. సినిమాలో సూపర్ హిట్ సాంగ్ లో ఒకటైన సరాసరి సాంగ్ కు ముందు ఈ సీన్ వస్తుంది. ఈ డిలీటెడ్ సీన్ లో రష్మిక క్యూట్ గా తన ఫ్యాన్స్ ను అలరిస్తుంది. సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవడమే కాకుండా నితిన్ కెరియర్ కు మంచి బూస్టప్ ఇచ్చింది. ఇక రష్మిక కూడా ఈ ఇయర్ ఆల్రెడీ సరిలేరు నీకెవ్వరుతో హిట్ అవగా భీష్మతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

 

ప్రస్తుతం రష్మికసినిమా చేస్తే అది హిట్టే అన్న సెంటిమెంట్ ఏర్పడింది. త్వరలో మొదలయ్యే సుకుమార్ బన్ని సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. అంతేకాదు చిరంజీవి ఆచార్యలో కూడా చరణ్ సరసన అమ్మడు నటిస్తుందని తెలుస్తుంది. మొత్తానికి రష్మిక టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉందని చెప్పొచ్చు.   

మరింత సమాచారం తెలుసుకోండి: