పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ గురుంచి  కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన అభిమానులు.. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా విడుదల కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులు ఒకే టైం లో పవన్ కళ్యాణ్ నటిస్తుండడంతో....ఎంతగానో  మురిసిపోయారు అభిమానులు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో  సినిమా షూటింగ్ లు అన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఎప్పుడెప్పుడు  పవన్ కళ్యాణ్ సినిమా చూద్దామా అని ఎదురు చూస్తున్న అభిమానులకు లాక్ డౌన్  ఎఫెక్ట్ తో నిరీక్షణ తప్పులేదు. 

 

 

 వాస్తవానికి అయితే పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా మే లో  విడుదల కావాల్సి ఉంది కానీ ప్రస్తుతం లాక్ డౌన్ తో  విడుదల కాస్త వాయిదా పడింది. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14న లాక్ డౌన్  ఎత్తేస్తే... తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందని  అభిమానులకు  మరిన్ని ఆశలు పెరిగాయి. కానీ ఇప్పుడు మే మూడో తేదీ వరకు లాక్ డౌన్  కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో..వకీల్ సాబ్  పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. ఇదిలా ఉంటే ఒకవేళ మే లో లాక్  ఎత్తేసిసినప్పటికీ జూన్ వరకు సినిమా షూటింగులు మొదలయ్యే అవకాశం కూడా లేనట్లు తెలుస్తోంది. 

 

 

 దీంతో అన్ని సినిమాలు నిరవధికంగా వాయిదా పడుతున్నాయి అని స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా వకీల్ సాబ్  లాంటి భారీ అంచనాలున్న  సినిమాలు.. ప్రస్తుతం వాయిదా పడుతూ వస్తున్న.  నేపథ్యంలోనే పవన్  సినిమాని దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లు సమాచారం. షూటింగు ఎప్పుడు మొదలైంది సరే ఎలాంటి హడావిడి లేకుండా సినిమాను తెరకెక్కించి... విడుదల చేయాలని నిర్మాత దిల్రాజు భావిస్తున్నారట. మంచి డేట్ కి   సినిమాను విడుదల చేయాలని భావిస్తున్న నిర్మాతలు... విడుదలకు సరైన సమయం దసరా అయితే బాగుంటుంది అని భావిస్తున్నారట. చూడాలి మరి వకీల్ సాబ్ ఎప్పుడొస్తాడో అభిమానుల నిరీక్షణ ఎప్పుడు తీరుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: