ప్రపంచ వ్యాప్తంగా వణుకుతున్న మహమ్మారి ప్రజలలో భయాన్ని కలిగిస్తుంది.. ఎక్కడ చూసినా కరోనా నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ వినపడే అర్దనాదాలు మాత్రమే అందుకే చాలా మంది పేదలు లాక్ డౌన్. కారణంగా ఆకలితో అలమటిస్తున్నారు.. అందుకే పేదలను ఆదుకోవడానికి సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల మనసును గెలుచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారు..

 

 

 

కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు . 

 

 

 

 

 

కరోనా పై పోరాటానికి ప్రజలు సిద్దం కావాలని సినీ ప్రముఖులు ఉత్తేజ పరుస్తున్నారు.. వీడియోల ద్వారా జాగ్రత్తలు తెలిపితే మరీ కొందరు మాత్రం రకరకాలా వీడియో నుపొస్ట్ చేస్తూ అభిమానులకు కావలసిన ఉత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు..ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొస్తున్నారు.. పలుగురు విరాళాలను అందిస్తున్నారు.. మరికొంత మంది స్వయంగా వచ్చి ప్రజలకు కావలసిన అత్యవసర నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు.. 

 

 

 

 

 

 

తాజాగా సినీ నటుడు మంచు మనోజ్ , తన మేనకోడలు నిర్వాణ తో కలిసి ఓ వీడియో ను రూపొందించి సోషల్ మాధ్యమాల్లో షేర్ చేశారు.. గుండె చెదర బోకురా.. గూడు వదలమాకురా.. దైర్యం వీడ బొకురా అంటూ మొదలైన ఆ పాటను దేవుడు లాంటోడే గుడిని వదల్లేదు .. మీరు ఇళ్ళ నుంచి బయటకు రాకుండా పోలీసులకు, డాక్టర్లకు, పారిశుధ్య కార్మికుల కు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఎండ్ చేశారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది..తాజాగా స్పందించిన తెరాస మంత్రి కేటీఆర్ ఈ చీకటి ఇలాగే ఉండిపోదని, మళ్లీ వెలుగు వస్తుందని.. గొప్ప ఆత్మస్థైర్యం ఇచ్చే గీతం. మన హృదయాల్లో పాజిటివిటీ నింపి, స్ఫూర్తినిచ్చే మనోజ్‌ గీతం’ అని పోస్ట్‌ చేశారు. కేటీఆర్‌కు మనోజ్‌ ధన్యవాదాలు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: