లాక్ డౌన్ టైం లో సినిమా లవర్స్ తమకు ఇష్టమైన సినిమాలు చూస్తూ టైం పాస్ చేస్తున్నారు ఎంత వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కూడా ఆ వర్క్ ను కంప్లీట్ చేసి 24 గంటల్లో ఒక రెండున్నర గంటలు సినిమాలు చూసేందుకు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో ఇష్టమైన దర్శకుల సినిమాల లిస్ట్ తీసి ఆ సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూసేస్తున్నారు. టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ సుకుమార్ డైరక్షన్ లో వచ్చి ఈ లాక్ డౌన్ టైం లో చూడాలనిపించే టాప్ 5 సినిమాలు ఇప్పుడు చూద్దాం. 

 

మొదటి సినిమాతోనే తన ముద్ర వేసుకున్న సుకుమార్ ఆర్య తో ఫీల్ మై లవ్ అనే కొత్త కాన్సెప్ట్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు. లెక్కల మాస్టారు కాస్త డైరక్టర్ గా మారగా హిట్టు సినిమాకు కావాల్సిన సమీకరణాలు అన్నీ పర్ఫెక్ట్ గా సరిచూసుకుంటాడు సుకుమార్. ఆర్య అటు సుకుమార్ కు మాత్రమే కాదు అల్లు అర్జున్ కు లిఫ్ట్ ఇచ్చిన సినిమా ఆ సినిమాతో అల్లు అర్జున్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఆ టాటా జగడం రామ్ తో తీశాడు సుక్కు. అయితే అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. మళ్ళీ బన్నీతో ఆర్య 2 చేశాడు సుకుమార్. ఆ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. సుకుమార్ డైరక్షన్ లో అల్లు అర్జున్ సినిమాల అంటే కచ్చితంగా డిఫార్న్త గా ఉంటుంది అనుకునేలా ఆర్య 2 ఉంది. ఇక సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన 100% లవ్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా కూడా ఈ లాక్ డౌన్ టైం లో చూసేయొచ్చు. 

 

ఇక ఎన్టీఆర్ తో చేసిన నాన్నకు ప్రేమతో సినిమాను కూడా ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది. ఇక ఫైనల్ గా చిట్టిబాబు రికార్డులను చితక్కొట్టిన రంగస్థలం కూడా ఎక్కువా ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది. తాను చేసే ఏ సినిమా అయినా లాజికల్ గా ఉండాలని చూసే సుకుమార్ రంగస్థలంలో అది పక్కన పెట్టి తీసి హిట్టు కొట్టాడు. ఈ లాక్ డౌన్ టైం లో మరోసారి సుకుమార్ చేసిన ఈ సినిమాలు చూసి ఇంట్లోనే ఉంది కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడితే బెటర్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: