కరోనా స్వీయ నిర్బంధాన్ని ఒకవైపు సల్మాన్ ఖాన్ ఎంజాయ్ చేస్తూ.. మరోవైపు తన చేష్టలతో నవ్విస్తున్నాడు. ఇంకోవైపు జనాల్లో అవేర్ నెస్ కలిగిస్తున్నాడు. అపరిచితుడు మాదిరి సల్మాన్ ఇన్ని కోణాలను ఎలా చూపిస్తున్నాడని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.


కరోనా వైరస్ కట్టడి చేసేందుకు సల్మాన్ ఖాన్ వినూత్నంగా ఆలోచించాడు. ఈ క్రమంలో తనకు స్టార్ డమ్ తీసుకొచ్చిన మైనే ప్యార్ కియా సినిమాలోని ఓ సీన్ ను కరోనాను కంట్రోల్ చేయడానికి వాడుకున్నాడు. సినిమాలో సల్మాన్ ఇంటికి వచ్చిన భాగ్యశ్రీ ఆయనకు చెప్పకుండా వెళ్లిపోతుంది. ఇంట్లోని గాజు గోడకు లెటర్ అంటించి.. ముద్దుపెట్టి వెళ్లిపోతుంది. లెటర్ చదివిన సల్మాన్ ఖాన్ లిప్ స్టిక్ రూపంలో ఉన్న పెదాలను కిస్ చేస్తాడు. ఈ సీన్ ను సల్మాన్ కరోనా కోసం వాడుకున్నాడు. గాజుగోడపై ఉన్న లిప్ స్టిక్ గుర్తును కిస్ చేయకుండా.. లిక్విడ్ స్ప్రే చేసి.. గుడ్డతో తుడిచేస్తాడు. 

 

మరి ఈ ఐడియా ఎవరు చెప్పారో గానీ.. నెటిజన్లలో అవగాహన కల్పించడంతో పాటు నవ్వించింది. ఈ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయగా.. మూడు గంటల్లో దాదాపు 10లక్షల మంది ఈ వీడియోను చూశారు. సల్మాన్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ముంబయిలోని ఫాం హౌస్ లో ఉన్నాడు. ఆ మధ్య గుర్రాలతో కాలక్షేపం చేసిన వీడియోలను పోస్ట్ చేశాడు. 

 

ఫామ్ హౌస్ లో ఉన్న గుర్రానికి పచ్చగడ్డి పెడుతూ.. తను కూడా తిని షాక్ ఇచ్చాడు సల్మాన్. కరోనా టైమ్ లో ఏం చేస్తున్నాడో తెలియడం లేదని నెటిజన్లు చేసిన కామెంట్స్ కు ట్వీట్ ఇస్తూ.. అవగాహన కల్పించేలా.. మైనే ప్యార్ కియాలోని వీడియోను వాడుకున్నాడు సల్మాన్. ఈ లాక్ డౌన్ మరో 15రోజులు సాగితే.. సల్లూభాయ్ నుంచి ఇంకెన్ని విచిత్రమైన వీడియోలు వస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: