టాలీవుడ్ సీనియర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 1996వ సంవత్సరంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తో సినీ పరిశ్రమలోకి రంగప్రవేశం చేశారు. అయితే ఆ సినిమా ప్రేక్షకాదరణ అంతగా పొందలేదు. దాంతో పవన్ కళ్యాణ్ తమిళంలో హిట్ అయిన గోకులతై సీతై’ సినిమా ని తెలుగులో గోకులంలో సీత అనే పేరుతో రీమేక్ చేసి సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. తెలుగు ఏం.ఎ చదివి అప్పట్లో టాలీవుడ్ రచన రంగం లో ఉద్దండుడు గా కొనసాగుతున్న పోసాని కృష్ణ మురళి గోకులంలో సీత సినిమాకు మాటలను అందించారు. అయితే తాను మాటలు రాసిన గోకులంలో సీత సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో... పోసాని కృష్ణమురళి మీడియా విలేకరులతో సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.


మీడియా సమావేశంలో పోసాని కృష్ణమురళి,  పవన్ కళ్యాణ్ ని సంబోధిస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. దాంతో విలేకరులంతా ఇదేదో బాగుందే అనుకొని తమ వార్తాపత్రికలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ తన నటన గురించి, ఇంకా సినిమా గురించి కథనాలు ప్రచురించారు. ఇక అప్పటినుంచి పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ అనే పేరుతో పిలవడం ప్రారంభించారు అభిమానులు. ఆ తర్వాత సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ కింద వచ్చిన సుస్వాగతం సినిమా పేర్ల స్క్రోలింగ్ లో పవన్ కళ్యాణ్ బదులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఆ సినీ బృందం వేయించింది.


ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ అనే బిరుదుని పెట్టిన పోసాని కృష్ణ మురళి పవన్ అభిమానులు తప్పకుండా కృతజ్ఞతలు చెప్పవలసిందే. బిరుదుకి తగ్గట్టు గా పవన్ కళ్యాణ్ కూడా నాన్న తన ప్రతిభతో తెలుగు ఇండస్ట్రీలో తన సత్తా చాటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: