ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్క తాటి పైకి వస్తుంది అందరు విజయ్ దేవరకొండ కి అండగా నిలుస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ కు సంబంధించి ఓ గాసిప్ వెబ్సైట్ రాసిన కథనానికి విజయ్ దేవరకొండ ఏకంగా 20 నిమిషాల పాటు వీడియో చేసి వెబ్ సైట్ ను ఏకిపారేసిన విషయం తెలిసిందే. చిరంజీవికి పోటీగా పేదలకు హెల్ప్ చేయడానికి దేవరకొండ ట్రస్టును స్థాపించాడని కేవలం ఏడు వేల మందికి మాత్రమే హెల్ప్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఏదో ఒక గల్లి కి వెళ్లి సహాయం చేస్తే సరిపోతుంది కదా అంటూ విజయ్ దేవరకొండ పై  నెగటివ్ గా ఓ కథనాన్ని ప్రచురితం చేసింది ఓ గాసిప్ వెబ్సైట్. 

 

 దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ... నాకు మనసుకు సహాయం చేయాలి అనిపించినప్పుడు చేస్తాను... నన్ను అడగటానికి మీరెవరు.. సహాయం చేస్తున్నానా  లేనా అనే విషయం ఐదవ తరగతి విద్యార్థికి కూడా అర్థం అవుతుంది కానీ వార్తలు రాసే ముసలాయనకు  మాత్రం అర్థం కాలేదు.. నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు అని కోపంతో నాపై చెడు వార్తలను ప్రచారం చేస్తారు... మాపైనే బతుకుతూ మా మీద వార్తలు రాసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ మళ్లీ మమ్మల్ని చెడుగా  చూపిస్తారా  అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ కు సంబందించిన  ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా...  దీనికి టాలీవుడ్ ప్రముఖులు అందరు మద్దతు తెలుపుతున్నారు. 

 

 ఎలాంటి ఆధారం లేకుండా వచ్చే ఇలాంటి ఫేక్ వార్తల గురించి పట్టించుకోవద్దని మానవతా దృక్పథంతో ముందుకు సాగాలని నీకు అండగా మేముంటాం అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు అందరూ ముందుకు వచ్చి విజయ్ దేవరకొండ కు మద్దతు పలుకుతున్నారు. దీంతో ఆ గాసిప్ వెబ్సైట్ కాస్త తనంతట తాను పెంట పెంట  చేసుకుంది అనే చెప్పాలి. టాలీవుడ్ పెద్దగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా బ్రదర్ నాగబాబు, మహేష్ బాబు,  పూరి జగన్నాథ్, అనిల్ రావిపూ, డి హరీష్ శంకర్  ఇలా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు అందరు ఒక తాటిపైకి వచ్చి విజయ్ దేవరకొండ కు మద్దతు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: