టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఎంతో దగ్గరైన హీరో ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు వెంకటేష్. మొదటి నుంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉండే సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వెంకటేష్. ఎలాంటి ఫ్యామిలీ ఎమోషన్ అయిన తన హావభావాలను  పండిస్తూ ప్రేక్షకులను సైతం కన్నీళ్లు పెట్టించగల హీరో  వెంకటేశ్ అని చెప్పాలి. అలాగే భారీ యాక్షన్ సన్నివేశాలలో కూడా ఇరగదీస్తు ఉంటారు వెంకటేష్. ఇక తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకూ వెంకటేష్ చాలా రీమేక్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

 

 

 కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాలు అయితే మరికొన్ని ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు. అయితే వెంకటేష్ హీరోగా సిమ్రాన్ హీరోయిన్ గా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన చిత్రం కలిసుందాం రా. ఈ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఉదయ్ శంకర్ దర్శకత్వంలో వెంకటేష్ సిమ్రాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు అందరినీ మెప్పించింది అనే చెప్పాలి. ఎన్నో ఏళ్ల నుంచి తాతకి దూరమైన మనవడు తాత ని కలవడానికి వస్తే... అక్కడ మరదలు సిమ్రాన్ తో ఎలా ప్రేమలో పడతాడు తర్వాత వీరిద్దరి ప్రేమ ఎక్కడ వరకు దారి తీస్తుంది అన్నది ఈ సినిమా స్టోరీ.

 

 

 సినిమాను దర్శకుడు ఎంతో చక్కగా ఓ వైపు కామెడీ దట్టిస్తూనే మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో సరికొత్త కామెడీ తో అదరగొట్టాడు దర్శకుడు. వెంకటేష్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫ్యామిలి  ఎమోషన్స్ లో ప్రేక్షకులను మెప్పించి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించటం  ఆయన సొంతం. ఇదిలా ఉంటే ఈ సినిమాను హిందీ సినిమా అయినా కుచ్  తుం  కహో  కుచ్  హమ్  కహెయిన్ అనే సినిమా నుండి రీమేక్ చేశారు. ఈ సినిమా హిందీలో కూడా మంచి విజయాన్ని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: