టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హ్యాపీడేస్ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్.. ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల్లో న‌టించి టాలీవుడ్‌లో ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌ర్చుకున్నాడు. స్వామిరారా, సూర్య వ‌ర్స‌స్ సూర్య‌, కార్తికేయ‌, ఎక్క‌డకి పోతావు చిన్న‌వాడా, కేశ‌వ‌, అర్జున్ సుర‌వ‌రం లాంటి వ‌రుస విజ‌యాలు సొంతం చేసుకున్న నిఖిల్ కి క్రేజ్ కూడా బాగానే ఉంది. అయితే ఈ యంగ్ హీరో నిఖిల్ త్వరలో ఓ ఇంటివాడు కబోతున్న సంగ‌తి తెలిసిందే. నిఖిల్‌ భీమవరంకు చెందిన వైద్యురాలు పల్లవిని వివాహం చేసుకోబోతున్నారు. 

 

ఇటీవల కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థం జరిగింది. ఇక ఏప్రిల్‌ 16న వివాహం నిశ్చయించారు. కానీ, క‌రోనా దేశ‌మంత‌టా లాక్‌డౌన్ అయింది. లాక్‌డౌన్ కార‌ణంగా.. ఎక్కడికక్కడ జనజీవనం స్థంబించేలా చేసింది. ఎవరూ ఏ పని చేయకుండా.. అందరినీ ఇంటికే పరిమితం అయ్యేలా లాక్ చేసింది. దీంతో ఎక్క‌డివారు అక్క‌డే లాక్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే హీరో నిఖిల్ వివాహం వాయిదా ప‌డింది. జనం ఎక్కువగా గుమికూడదనే రూల్ ఉండటంతో అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకున్న నిఖిల్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.

 

కానీ, తాజా స‌మాచారం ప్ర‌కారం హీరో నిఖిల్ పెళ్లి కి మళ్లీ మహుర్తం సెట్ అయింది. కరోనా కారణంగా వాయిదా పడిన నిఖిల్ పెళ్లి.. కరోనా కల్లోలం ముగిసాకే చేసుకుందా అనుకున్నాడు. కానీ మూఢం, మంచి రోజులు లేకపోవడంతో నిర్ణయం మార్చుకుని అర్జెంట్ గా చేసేసుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. ఈయన వివాహం రేపు నగర శివార్లలోని ఓ ఫామ్ హవుస్ లో జరగనుంద‌ని స‌మాచారం. ఇక ఈ రోజు పెళ్లి కూతుర్ని చేస్తారు. అలాగే పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం కూడా ఈ సాయంత్రం ఉంటుందంటున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఇరువైపులకు చెందిన అతి కొద్ది మందితో వివాహ కార్యక్రమం నిర్వహించబోతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: