జబర్దస్త్ కామెడీ షోలో  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ను  ఇమిటేట్ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఎంతో  గుర్తింపు తెచ్చుకున్నారు నవీన్. ప్రస్తుతం అదిరే అభి  టీంలో కంటెస్టెంట్ గా చేస్తున్న నవీన్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన నవీన్ తాను డబ్బు విషయంలో ఎవరినీ నమ్మనని.. అలా  నమ్మకపోవాటానికి  కూడా ఒక కారణం ఉంది అంటు.. ఒక సంచలన నిజాన్ని చెప్పుకొచ్చాడు.తాను  జాబ్ చేస్తున్న సమయంలో ఓసారి తనను చంపాలని చూసారు అంటూ చెప్పాడు. 

 

 వెంకటేష్ అనే వ్యక్తి నాకు మంచి స్నేహితుడని అతని ద్వారా మరో వ్యక్తి పరిచయం కాగా ఆ వ్యక్తి ద్వారా మల్లేష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు అని తెలిపాడు జబర్దస్త్ నవీన్. అయితే మల్లేష్ మంచోడని అనుకున్నానని.. అయితే ఓసారి తన స్నేహితుడు తన వద్దకు వచ్చి తన బండి తాకట్టు పెట్టి డబ్బులు ఇప్పించాలని కోరగా అందుకు మల్లేష్  సహాయాన్ని కోరాను  అంటూ తెలిపాడు.ఇద్దరం కలిసి ఒక వ్యక్తి వద్దకు వెళ్లగా... అక్కడ డబ్బులు తీసుకున్న మల్లేష్ అనే వ్యక్తి మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు అంటూ తెలిపాడు జబర్దస్త్ నవీన్. 

 

 ఇక ఆ తర్వాత వడ్డీకి డబ్బులు ఇచ్చిన వ్యక్తి తనను డబ్బులు అడగడం మొదలు పెట్టాడని... తానెందుకు ఇస్తాను డబ్బులు తీసుకున్న వారే  ఇస్తారు అంటూ నేను సమాధానం చెప్పడంతో.. తనను చంపాలని చూసారు అంటూ తెలిపాడు. నీ పేరుమీద అతడు తీసుకున్నాడని... కలవాలంటూ ఒక దగ్గరికి రమ్మన్నాడు డబ్బులు ఇచ్చిన వ్యక్తి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి స్కూటర్లో ఏకంగా కత్తులు కూడా తీసుకు వచ్చాడు. దీంతో తనను చంపడానికి ప్లాన్ జరుగుతుందని భావించి వెంటనే పోలీస్ స్టేషన్ ను  ఆశ్రయించానని అప్పటి నుంచి డబ్బులు విషయం లో ఎవర్ని నమ్మద్దని  నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: