బిగ్ బాస్ ఫేమ్, హీరోయిన్ అర్చన.. గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మొదటి సీజన్ లో తళుక్కున మెరిసిన ఈ తెలుగమ్మాయి.. నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శ్రీ రామదాసు, పౌర్ణవి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత అర్చన చేసిన అన్ని సినిమాలు ఫ్లాపుల దిశగా వెళ్లాయి.
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది. కానీ సరైన హిట్ లేకపోవడంతో హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయింది. దీంతో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గుతూ వచ్చేశారు. అవకాశాలు తగ్గుతున్న తరుణంలోనే ఈ బ్యూటీ బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. అయినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు.
అయితే ఇటీవల ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలం అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయింది అర్చన. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టింది.
నా భర్త ఎప్పుడు చూసిన ఫోన్ పేకాట ఆడుతూ ఉంటాడు. ఈ విషయంలో నాకు ఎప్పుడూ కోపం వస్తుంది అంటూ అర్చన చెప్పుకొచ్చింది. అంతేకాదు, తన భర్త బాత్ రూంలోకి వెళితే గంటల తరబడి బయటకు రాడని, ఆ విషయం కూడా నాకు చాలా చిరాకు తెప్పిస్తుందని తెలిపింది.
అయితే పెళ్లికి ముందు నా భర్తకు ఈ అలవాట్లు ఉన్నాయని నాకు తెలియదని చెప్పింది అర్చన. కొన్నిసార్లు చాలా కోపం వస్తుందని సరదాగా నవ్వుతూ చెప్పుకొచ్చింది. కాగా, ప్రస్తుతం తన అందంతో కుర్రకారు హీటెక్కించిన ఈ భామ ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటుంది.