తెలుగు చిత్ర పరిశ్రమలో కీర్తి రెడ్డి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ కీర్తి రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం అనే చెప్పాలి. అప్పట్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారందరినీ వెనక్కి నెట్టి ఒక్కసారి గా ఒక వెలుగు వెలిగింది కీర్తి రెడ్డి. తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని ఎంతోమంది తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమలో కీర్తి రెడ్డి నటించినవి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ.. కీర్తి రెడ్డి తన అందం అభినయం నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకుంది  అని చెప్పాలి.

 

 పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా తో కీర్తి రెడ్డి కెరియర్ కీలక మలుపు తిరిగింది అనే చెప్పాలి. తొలిప్రేమ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో కీర్తి రెడ్డి క్రేజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా పెరిగిపోయింది. తొలిప్రేమ సినిమా తో స్టార్ డైరెక్టర్ ల దృష్టిని ఆకర్షించింది కీర్తి రెడ్డి. ఇక ఆ తర్వాత అక్కినేని నాగార్జున సరసన రావోయి చందమామ సినిమాలో కూడా నటించింది. ఇలా వరుస అవకాశాలు అందుకుంటూ... స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది కీర్తి రెడ్డి. ఇలా వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ప్రేమ పెళ్లితో  సినిమాలకు దూరమయింది. 

 


 అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో సుమంత్  తో ప్రేమలో పడింది కీర్తి రెడ్డి. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటికీ వీరిద్దరు మాత్రం ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. పెళ్లయిన ఏడాదికే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు ఈ జంట. ఇక ఆ తర్వాత కూడా కీర్తి రెడ్డి పలు సినిమాలలో హీరో అక్క  పాత్రలు లేదా వివిధ పాత్రల్లో నటిస్తూ తన అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక విడాకుల తర్వాత సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఆ తర్వాత కీర్తి రెడ్డి ఒక ఎన్ఆర్ఐ ని పెళ్లి చేసుకొని అమెరికా లోనే సెటిల్ అయింది. కీర్తి రెడ్డి కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక విడిపోయినప్పటికీ సుమంతో మంచి స్నేహాన్ని కొనసాగిస్తుంది కీర్తి రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: