ప్రస్తుతం తెలుగు చిత్ర ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలు వస్తున్నాయి. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరూ కూడా మల్టీస్టారర్ సినిమాల్లో నటించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. స్క్రిప్ట్  బాగుంటే మల్టీస్టారర్ సినిమాల్లో నటించేందుకు అస్సలు వెనుకడుగు వేయడం లేదు. అయితే ఎన్ని  మల్టీస్టారర్ సినిమాలు వచ్చినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం కొంత మంది హీరోలు కలిసి నటిస్తే బాగుండు అని ఒక కోరిక ఉంటుంది. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో యువతలో బాగా క్రేజ్ సంపాదించిన హీరోలైన విజయ్ దేవరకొండ విశ్వక్ సేన్ లు కలిసి నటిస్తే బాగుంటుందని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 

 

 విజయ్ దేవరకొండ విశ్వక్సేన్ లు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ప్రస్తుతం మంచి క్రేజ్ వున్న హీరోలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి ఆటిట్యూడ్ కూడా సేమ్ ఉంటుంది. ఇక ఇద్దరు హీరోలు ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఇక వీరిద్దరి నటన కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. ఇక వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. యూత్ లో ఈ ఇద్దరు హీరోల కి ఉన్న క్రేజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకి లేదు అనడంలో అతిశయోక్తి లేదు. 

 

 తమదైన డైలాగులతో యువతని ఆకర్షించి  ఆటిట్యూడ్తో యూత్  లో తెగ ఫాలోయింగ్ సంపాదించారు ఈ ఇద్దరు యువ హీరోలు. అందుకే ఈ ఇద్దరు యువ హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తే ఆ స్క్రిప్టు ఎలా ఉంటుంది అన్నది అభిమానులకు కూడా ఊహకందని. అందుకే ఈ ఇద్దరు హీరోల మల్టీ స్టారర్ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. మరి తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నట్లుగా ఈ ఇద్దరు యువ హీరోలు మల్టీస్టారర్ సినిమా ఎప్పుడు వస్తుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం అది యూత్ కి  పండగ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: