టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన అనీల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అటు స్టార్స్ తో పాటుగా యువ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ వస్తున్నారు. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న అనీల్ సుంకర ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తుంది. ఆయనకు బాగా ఇష్టమైన షాడో సెరెస్ కు విజువల్ రూపం ఇవ్వబోతున్నారట అనీల్ సుంకర. మధు బాబు రచించిన షాడో అవల ఆధారంగా వెబ్ సీరీస్ చేయాలని నిర్ణయించుకున్నారట.

 

అందుకోసం మధుబాబు దగ్గర నుండి పర్మిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతా బాగానే ఉంది కాని ఈ వెబ్ సీరీస్ లో సూపర్ హీరోగా నటించే లీడ్ యాక్టర్ ఎవరన్నది ఇప్పుడు కన్ ఫ్యూజన్ ఏర్పడుతుంది. స్టార్ హీరోలు ఎలాగు ఇప్పుడప్పుడే వెబ్ సీరీస్ ల మీద ఇంట్రెస్ట్ చూపించే అవకాశం లేదు. వాళ్లు కమిటైన సినిమాలు పూర్తి చేసేందుకే టైం సరిపోవట్లేదు. కాబట్టి షాడో సీరీస్ లో సూపర్ హీరోగా యువ హీరోనే నటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ వెబ్ సీరీస్ లో ఎవరిని సూపర్ హీరోగా చూపిస్తారో మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.

 

ప్రస్తుతం అనీల్ సుంకర అల్లరి నరేష్ హీరోగా వస్తున్న బంగారు బుల్లోడు సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు అల్లరి నరేష్. సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నాంది సినిమా చేస్తున్న్నాడు మన అల్లరోడు. క్రైం థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఆ సినిమా నుండి వచ్చిన ప్రీ లుక్ లో న్యూడ్ గా కనిపించి షాక్ ఇచ్చాడు అల్లరి నరేష్. మరి ఈ కామెడీ హీరో నాందితో సరికొత్త అటెంప్ట్ చేస్తున్నాడన్న విషయం మాత్రం అర్ధమైంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: