కన్నడ బ్యూటీ రష్మిక డ్రీమ్‌కు కరోనా బ్రేకులేసింది. ఫ్యూచర్‌పై  ఎన్నో ఆశలు పెట్టుకుని..  ఓ కల మాత్రం 2020లో తీర్చేసుకోవాలని అనుకుంది. దీనికి తగ్గట్టే సరిలేరునీకెవ్వరు సక్సెస్‌తో పరిస్థితులు కలిసొచ్చాయి. ఇంతలో మహమ్మారిలా దూసుకొచ్చిన కరోనా రష్మిక టార్గెట్‌పై నీళ్లు చల్లింది. ఇంతకీ రష్మిక డ్రీమ్‌ ఏమిటో తెలుసా..  

 

టాలీవుడ్‌ టాప్‌ త్రీ హీరోయిన్స్‌లో రష్మిక కూడా వుంటుంది. మిగతా ఇద్దరు టాపర్స్‌ పూజా హెగ్డే.. కియారా అద్వానీతో పోల్చుకుంటే.. రష్మిక రెమ్యునరేషన్‌ తక్కువే. ఈ ఏడాది సరిలేరునీకెవ్వరు.. భీష్మ వంటి వరుస హిట్స్‌తో  రెమ్యునరేషన్‌ పెంచేద్దామనుకుంది. దీనికి తగ్గట్టే... కోటిన్నర.. రెండు కోట్ల మధ్యలో వున్నట్టు మేనేజర్‌తో సంకేతాలు కూడా పంపిందట. 

 

రెండు కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకోవాలన్న రష్మిక కలను కరోనా చెదరకొట్టింది. థియేటర్స్‌ మూతపడ్డాయి.  షూటింగ్స్‌ ఆగిపోయాయి. సినిమా ఇండస్ట్రీ మళ్లీ ఎప్పుడు కోలుకుంటుందో తెలీయడం లేదు. బడ్జెట్‌ను తగ్గించుకోవాలని.. ఈ క్రమంలో రెమ్యునరేషన్‌ కూడా తగ్గించాలన్న అభిప్రాయానికి సినిమా ఇండస్ట్రీ వచ్చింది. దీంతో.. రష్మిక రెండు కోట్ల రెమ్యునరేషన్‌ కల కలగానే వుండిపోయింది.

 

రష్మిక ప్రస్తుతం తెలుగులో బన్నీ సరసన పుష్ప మూవీ చేస్తోంది. సరిలేరునీకెవ్వరు హిట్‌  కంటే ముందే నవంబర్‌లోనే పుష్ప ఓకె చేయడంతో.. కోటి మాత్రమే  దక్కిందట. ఈ లెక్కన 2 కోట్ల టార్గెట్‌ను చేరువకావడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. కరోనా  సద్దుమణిగి... మామూలు పరిస్థితులు ఎప్పుడొస్తాయా? ఎప్పుడు రెండు కోట్లు తీసుకుంటానా.. అన్న ఆశతో సినిమాలు చేసేస్తోంది రష్మిక. 

 

మొత్తానికి కన్నడ బ్యూటీ రష్మిక కలలు కల్లలైపోయాయి. ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయంది. డిమాండ్ ను బట్టి రెమ్యునరేషన్ తీసుకుందామని అనుకుంటే మధ్యలో కరోనా వచ్చి డ్రీమ్ ను చెదరగొట్టేసింది. ఇంకేముందీ ఫుల్ డిసప్పాయింట్ లో ఉండిపోయింది రష్మిక. అందివచ్చిన ఛాన్స్ తృటిలో మిస్ కావడంపై తెగ బాధపడిపోతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: