యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్ర అయినా సరే అవలీలగా చేసే తారక్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరో స్టార్ రాం చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ అల్లూరి సీతారమరాజుగా నటిస్తుండగా కోరం భీం పాత్రలో తారక రాముడు అదరగొట్టనున్నాడు. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ ఆడియెన్స్ ఎన్.టి.ఆర్ నటనని చూసి షాక్ అవడం గ్యారెంటీ అంటున్నారు.

 

తెలుగు ఆడియెన్స్ కు ఎన్.టి.ఆర్ అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మిగతా సౌత్ ఆడియెన్స్ లో కూడా ఎన్.టి.ఆర్ యాక్టింగ్ టాలెంట్ గురించి తెలుసు. ఎటొచ్చి బాలీవుడ్ ప్రేక్షకులకు ఎన్.టి.ఆర్ కొత్త.. అయితే అక్కడ ప్రేక్షకులకు ఆయన కొత్తేమో కాని తారక్ నట విశ్వరూపం గురించి అక్కడ స్టార్స్ కు బాగా తెలుసు. అక్కడ యువ హీరోల్లో కొందరు ఎన్.టి.ఆర్ నటనని ఇష్టపడతారు. అందుకే ఆర్.ఆర్.ఆర్ తో అక్కడ ఎన్.టి.ఆర్ తిష్ట వేస్తాడని చెప్పుకోవచ్చు.

 

ఇక రాం చరణ్ కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆల్రెడీ రాం చరణ్ బాలీవుడ్ ఆడియెన్స్ కు పరిచయం ఉన్నాడు. ప్రియాంకా చోప్రాతో తుఫాన్ సినిమా చేసిన చరణ్ ఆ సినిమాతో నిరాశ పరచినా ఐడెంటిటీ అయితే సంపాదించాడు. మరి ఇద్దరు సౌత్ స్టార్స్ బాలీవుడ్ బాక్సాఫీస్ పై చేయబోతున్న ఈ యుద్ధంలో ఎన్ని సంచలనాలు నమోదు అవుతాయో తెలియాలంటే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయ్యాక లెక్క పెట్టుకోవాల్సిందే. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమాసినిమా క్రియేట్ చేసిన రికార్డులు తిరగరాసి సరికొత్త సంచలనాలు సృష్టించిస్తుందని ఆశిస్తున్నారు సిని ప్రియులు.                 

మరింత సమాచారం తెలుసుకోండి: